|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rana Naidu 2 Review: రానా నాయుడు 2 రివ్యూ.. కుటుంబం కోసం ‘యుద్దం’

Published: 16-06-2025, 12:43 AM
Rana Naidu 2 Review: రానా నాయుడు 2 రివ్యూ.. కుటుంబం కోసం 'యుద్దం'

వెంకటేశ్, రానా నటించిన రానా నాయుడు సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కొడుకు కిడ్నాప్ తర్వాత రానా ఎదుర్కొనే సవాళ్లు, కుటుంబం కోసం చేసే యుద్ధం ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణలు.

Key Points

1

రానా నాయుడు కుటుంబం కోసం తన ప్రాణాలను పణంగా పెడతాడు.

2

కొడుకు కిడ్నాప్ తర్వాత రానా నేర ప్రపంచంలో ఇరుక్కుపోతాడు.

4

సీజన్ 1 కంటే కాస్త తక్కువ బోల్డ్ కంటెంట్.

కథాంశం: కిడ్నాప్ మరియు కుటుంబ యుద్ధం

వెబ్‌సిరీస్‌: రానా నాయుడు 2 నటీనటులు: వెంకటేశ్‌, రానా, అర్జున్‌ రాంపాల్‌, అభిషేక్‌ బెనర్జీ, రజత్‌ కపూర్‌, కృతి కర్బంద, సుర్విన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్‌ తదితరులు కథ: అనన్య మోదీ దర్శకత్వం: సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ స్ట్రీమింగ్‌ : నెట్‌ఫ్లిక్స్‌ ఎపిసోడ్స్‌: 8 కుటుంబంతో  చూడొచ్చా: ఇబ్బందికరమే. కానీ,సీజన్‌-1తో పోలిస్తే.. కాస్త బోల్డ్‌ కంటెంట్‌ తగ్గించారు.

వెంకటేశ్‌, రానా నటించిన రానా నాయుడు(Rana Naidu) సీజన్-1కు సీక్వెల్‌గా తాజాగా సీజన్‌ -2 విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మొదటి సీజన్‌ టైమ్‌లో ఈ వెబ్‌సిరీస్‌ భారీగా వివాదాస్పదమైంది. బూతులు, బోల్డ్‌ కంటెంట్‌ ఎక్కువ ఉందని విమర్శలు వచ్చాయి. అయితే,  పార్ట్‌2లో అలాంటి కంటెంట్‌ తగ్గించారు. ఇందులో రానాకు పెద్దపీఠ వేస్తూ తెరకెక్కిచారు. వెంటకటేశ్‌ కీలకపాత్రలో మెప్పించారు. అయితే, ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటంటే.. రానా నాయుడు (రానా ) నగరంలోని టాప్‌ సెలబ్రిటీలకు ఎలాంటి సమస్య వచ్చిన పరిష్కారం చూపుతాడు. అందుకోసం అతను ఎంత రిష్క్‌ అయినా సరే చేస్తాడు. అయితే,  భార్య కోరిక మేరకు, తన చీకటి గతాన్ని వదిలేయడానికి రానా ప్రయత్నిస్తుంటాడు. కానీ, అతడు అంగీకరించిన చివరి డీల్‌ పూర్తిచేసే క్రమంలో చిక్కుల్లో పడుతాడు. ఈ క్రమంలోనే రానా కొడుకు కిడ్నాప్ అవుతాడు. దీంతో రానా ఈ నేర ప్రపంచంలో మరింత లోతుగా ఇరుక్కుపోతాడు. కొడుకుని విడిపించుకునేందుకు  బాలీవుడ్‌కు చెందిన ఒక స్టూడియో ఓనర్ విరాజ్ ఒబెరాయ్ (రజత్ కపూర్) నుంచి సాయం తీసుకుంటాడు.

అందుకు ప్రతిగా తన దగ్గర మాత్రమే రానా పనిచేయాలని విరాజ్ షరతు విధిస్తాడు. తన కొడుకుని కాపాడే క్రమంలో రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తమ్ముడిని చంపేస్తాడు రానా. తన సోదరుడి చావుకు కారణమైన రానాపై పగ తీర్చుకోవాలని రవూఫ్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో రానా కుటుంబాన్ని రావూఫ్‌ టార్గెట్‌ చేస్తాడు. రానా చుట్టూ ప్రమాదం పొంచిఉన్న విషయం  నాగా నాయుడు (వెంకటేశ్‌)కు తెలుస్తోంది. అప్పుడు నాగా నాయుడు ఏం చేశాడు.? సెలబ్రిటీల కోసం రిష్క్‌ చేసే రానా తన ఫ్యామిలీ కోసం ఎలాంటి రిష్క్‌ చేశాడు..? రానాకు సాయిం చేస్తానని చెప్పిన విరాజ్‌ ఒబెరాయ్‌ (రజత్‌ కపూర్‌) చేసిన కుట్ర ఏంటి..? చివరికి తండ్రికొడుకులు తమ కుటుంబం కోసం ఎలాంటి పోరాటం చేస్తారు..? అనేది అసలు స్టోరీ.

నటన: వెంకటేశ్ మరియు రానా ప్రదర్శన

ఎలా ఉందంటే.. రానా నాయుడు: సీజన్‌2 కిడ్నాప్‌తో మొదలౌతుంది. వెంటనే  కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాడు దర్శకుడు. సీజన్‌-1 తన క్లయింట్స్‌ కోసం పోరాటం చేసిన రానా.. సీక్వెల్‌లో తన కుటుంబం కోసం పెద్ద యుద్దమే చేస్తాడు. తొలి సీజన్‌లో ఎక్కువ బూతులు ఉండటంతో కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇందులో అలాంటి సమస్య ఉండదు. ఒక మంచి  థ్రిల్లర్‌ సినిమా చూస్తున్న ఫీల్‌ మనకు కలిగేలా మేకర్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. కుమారుడు కిడ్నాప్‌తో రానాకు మరోవైపు ఇంటి సమస్యలు పెరుగుతాయి. భార్య కూడా విడిపోయే స్థితికి వస్తుంది. తండ్రి నాగా నాయుడుతో పాటు, సోదరులతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రానాకు నమ్మిన వాళ్లు కూడా కుట్రకు తెరలేపుతారు.

ఇలా అనేక సంఘటనలు ప్రేక్షకులలో జోష్‌ నింపుతాయి.  రానా, రావూఫ్‌ మీర్జా, విరాజ్ ఒబెరాయ్ కథలో కీలకం.  ఈ మూడు పాత్రల చుట్టూ డ్రామా, యాక్షన్, థ్రిల్‌తో పాటు భారీ ట్విస్టులు మెప్పిస్తాయి. ఈ సీజన్‌లో రానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. తన పాత్రన చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేయడంలో దర్శకులు సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అంశుమన్‌ విజయం సాధించారు. ఓటమి అంచు వరకు వెళ్లి అతను గెలిచే తీరు అందరిలో థ్రిల్ పంచుతుంది.

రానా నాయుడు తన సోదరుడిని చంపాడని రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తెలుసుకున్న సమయం నుంచి కథలో స్పీడ్‌ పెరుగుతుంది. వారిద్దరి మధ్య జరిగే వైరంతో పాటు అదే సమయంలో కుమారుడి కోసం రానా నాయుడు పడే తపన ప్రేక్షకులలో కంటతడి పెట్టిస్తుంది. అప్పుడు రానా ఫ్యామిలీలో కనిపించే ఎమోషన్స్‌.. వాటిని ప్రేక్షకులకు చూపించిన తీరు బాగుంటుంది. రానా నాయుడిని అంతం చేయాలని రావూఫ్ మీర్జా,  విరాజ్ ఒబెరాయ్‌లు ప్లాన్‌ వేస్తున్న సమయంలో నాగా నాయుడు (వెంకటేశ్‌ ) ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు మరింత ఆసక్తిగా కథ రన్‌ అవుతుంది.

విశ్లేషణ: సీజన్ 1 తో పోలిక

ఇలా సిరీస్‌లో కొన్ని బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ..  వాటిని అక్కడక్క బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది.  కొన్ని చోట్ల అయితే తప్పని పరిస్థితిలో అతికించారనే ఫీల్‌ కలుగుతుంది.  దర్శకులు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ మంచి సన్నివేశాలే ప్లాన్‌ చేసుకున్నారు. అయితే,  ఈ సిరీస్‌లో అన్ని ఎపిసోడ్స్‌లకు మధ్య ఉండాల్సిన లింక్‌ దెబ్బతిందేమోననే అభిప్రాయం కలుగుతుంది. భారీ యాక్టర్స్‌ ఉన్నప్పటికీ అక్కడక్కడగా పెద్దగా ఎమోషన్ పండలేదు. అయితే,  రానా నాయుడు ప్రతి ఫ్యామిలీని ఆలోచింప చేస్తాడు. భార్య భర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, పిల్లలను ఎలా పెంచాలి అనేది చాలా క్లారిటీగా  ఉంటుంది.

ఎవరెలా చేశారంటే.. సీక్వెల్‌లో నానా పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో ఆయనే కీలకం. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉంటాయి. ఒక్కొక్కటీ సుమారు 50 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇందులో మహిళా పాత్రధారులకు కొంత స్కోప్ ఇచ్చారు. భర్తతో (రానా) ఇబ్బంది పడుతున్న భార్యగా సుర్వీన్ చావ్లా అద్భుతంగా నటించింది. సర్వీన్ చావ్లాకు కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ. ఆ సీన్లు సహజంగానే ఉంటాయి. ఆ ట్రాక్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు.  నాగా నాయుడిగా వెంకటేశ్‌కు పెద్దగా స్క్రీన్‌ స్పేస్‌ ఉండదు. రానాకు విసుగు తెప్పించే పాత్రలో ఆయన అదరగొట్టాడు. అర్జున్‌ రాంపాల్‌ విలనిజాన్ని చాలా బలంగా చూపించాడు.

ఎపిసోడ్స్‌ నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువల విషయంలో నెట్‌ఫ్లిక్స్ ఎక్కడా కూడా రాజీపడలేదు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ సినిమా రేంజ్‌లో నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తాయి.  మూడో సీజన్‌ కూడా ఉంటుందని హింట్‌ ఇచ్చారు. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రధాన బలం రానా, వెంకటేశ్‌, దర్శకత్వం అని చెప్పవచ్చు. కథను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే రానా నాయుడు అదరగొట్టేవాడు. అయినప్పటికీ ఎంటర్‌టైన్‌ చేస్తాడు.

రానా నాయుడు 2, కుటుంబం కోసం సాగే పోరాటాన్ని చక్కగా చూపిస్తుంది. వెంకటేశ్ మరియు రానా నటన ఆకట్టుకుంటుంది. కానీ, సీజన్ 1తో పోల్చితే, కొంత బోల్డ్ కంటెంట్ తగ్గించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.