|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ranveer Singh: దీపికా ఇది వినవమ్మా.. అలా చేయడం తప్పుకాదట.. భార్యకు కౌంటర్ ఇచ్చిన రణవీర్

Published: 15-12-2025, 12:08 AM
Ranveer Singh: దీపికా ఇది వినవమ్మా.. అలా చేయడం తప్పుకాదట.. భార్యకు కౌంటర్ ఇచ్చిన రణవీర్
  • రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ చిత్రం 10 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
  • దీపికా పదుకొనె గతంలో 8 గంటల పనిపై చేసిన కామెంట్స్‌కు రణవీర్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు.
  • ఎక్కువ గంటలు పని చేయడం తప్పుకాదని, కొన్నిసార్లు షూటింగ్ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుందని రణవీర్ వివరించాడు.
  • దీపికా గతంలో ఈ వ్యాఖ్యల కారణంగా ట్రోలింగ్, ప్రాజెక్టుల రద్దు వంటి సమస్యలు ఎదుర్కొంది.

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనె గతంలో 8 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చాడు. రణవీర్ నటించిన ‘దురంధర్’ సినిమా విజయం సాధించిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన వివరణ ఇప్పుడు వైరల్ అవుతోంది.

దురంధర్ విజయం: రణవీర్ కొత్త ఇంటర్వ్యూ

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు, సినిమాకు వస్తున్నా పాజిటీవ్ టాక్ తో ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో దురంధర్ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, దురంధర్ మూవీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు హీరో రణవీర్ సింగ్(Ranveer Singh).

Rewind 2025: 2025 బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలు.. అంచనాలకు మించి..

దీపికా 8 గంటల కామెంట్స్: గత వివాదం

ఈ ఇంటర్వ్యూ లో భార్య దీపికా పదుకునే చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె గతంలో 8 గంటల వర్క్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ పై దీపికా చాలా ట్రోలింగ్ ని ఎదుర్కొంది. అంతేకాదు, ఈ కారణంగా ఆమెను రెండు భారీ ప్రాజెక్టుల నుంచి కూడా తీసేశారు. దాంతో, ఆ ఇష్యు మరింత సంచలంగా మారింది. ఇక తాజాగా భార్య దీపికా చేసిన కామెంట్స్ పై షాకింగ్ రిప్లై ఇచ్చాడు రణవీర్ సింగ్.

రణవీర్ సంచలన వివరణ: సరికొత్త చర్చ

ఈ ఇంటర్వ్యూలో దీపికా 8 గంటల కామెంట్స్ ని ప్రశవించారు యాంకర్. దానికి సమాధానంగా రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. “పని గంటల విషయంలో చాలా సార్లు సహచర నటీనటులు నాపై ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఎందుకంటే, నేను కొన్నిసార్లు 10 నుంచి12 గంటలు షూటింగ్ చేస్తూనే ఉంటాను. దాంతో, వారు కూడా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా వారి ఇతర సినిమాల షెడ్యూల్ కు ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు 8 గంటల్లో అనుకున్న షూట్ పూర్తి కాకపోవచ్చు కదా. అప్పుడు ఎక్కువ సేపు షూటింగ్ చేసుకోవడంలో తప్పు లేదు కదా” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రణవీర్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి భర్త చేసిన ఈ కామెంట్స్ పై దీపికా ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి.

దీపికా గతంలో ఎదుర్కొన్న ట్రోలింగ్, ప్రాజెక్టుల రద్దు తర్వాత రణవీర్ ఇచ్చిన ఈ వివరణ మరింత చర్చనీయాంశంగా మారింది. భర్త వ్యాఖ్యలపై దీపికా ఎలా స్పందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.