|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక బర్త్డే ట్రీట్: ‘మైసా’ నుండి ఊహించని లుక్! రక్తం మరకల్లో రష్మిక రౌద్రం!

Published: 05-04-2026, 4:35 AM
రష్మిక బర్త్డే ట్రీట్: 'మైసా' నుండి ఊహించని లుక్! రక్తం మరకల్లో రష్మిక రౌద్రం!
  • రష్మిక పుట్టినరోజు సందర్భంగా ‘మైసా’ మూవీ నుండి స్పెషల్ పోస్టర్ విడుదల.
  • పోస్టర్లో రష్మిక ముఖంపై రక్తపు గాయాలతో రౌద్రంగా కనిపిస్తున్నారు.
  • ఈ చిత్రంలో రష్మిక గోండు తెగ మహిళగా నటిస్తోంది.
  • రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న ‘మైసా’ చిత్రం నుండి ఒక ప్రత్యేకమైన పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో రష్మిక మునుపెన్నడూ చూడని విధంగా రౌద్రంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

రష్మికకు బర్త్డే విషెస్ తెలిపిన మైసా టీమ్

Rashmika:వరుస విజయాలతో.. కోట్లాది రూపాయల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేస్తూ.. స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని.. నేడు పాన్ ఇండియా స్థాయిలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, వినూత్నమైన ఆలోచనలతో మెప్పిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న మైసా మూవీ నుండి మేకర్స్ రష్మిక కు స్పెషల్ బర్తడే విషెస్ ను తెలియజేస్తూ ఆమె లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

రష్మిక మందన్న వివాహం ముందు వరుస సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు వివాహం తర్వాత కూడా ఆ దూకుడు ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం మైసా. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఒక ఇంటెన్స్ అండ్ వైల్డ్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది . “ఆమె తన మనోహరమైన రూపంతో మనసులను దోచుకుంది. తన హుందాతనంతో అందరిని గెలుపొందింది. ఇప్పుడు ఆమె కేవలం రౌద్రంతో మన ముందుకు రాబోతోంది. ఎప్పటికీ అద్భుతంగా ఉండే రష్మికకు మైసా టీం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.. థియేటర్లలో ఆమె రౌద్ర ప్రదర్శనను చూడడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి ” అంటూ చిత్ర బృందం రాసుకొచ్చింది.

ఇకపోతే తాజాగా మైసా చిత్రం నుండి టీం పంచుకున్న ఈ పోస్టులో రష్మిక మునుపెన్నడూ కనిపించని విధంగా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తోంది. ముఖంపై రక్తపు చారలు, గాయాలతో ఉన్నప్పటికీ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న పట్టుదల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఒక పవర్ఫుల్ గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక నటిస్తోంది. ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమాకి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఇదే ఆయనకు దర్శకుడిగా తొలి చిత్రం కూడా.. అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

‘మైసా’ పోస్టర్లో రష్మిక రౌద్ర రూపం

రష్మిక తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. మైసా చిత్రంతో పాటు ఆమె తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగు ఇదివరకే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పార్ట్ ను పూర్తి చేసుకున్నారు . పైగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏది ఏమైనా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది ఈ చిన్నది.

Team #Mysaa wishes the ever-stunning #RashmikaMandanna a blazing Happy Birthday..❤️

గోండు తెగ మహిళగా రష్మిక నటన

Get ready for her most explosive performance yet In cinemas 2026.🔥 #RashmikaMandanna #Rashmika #Mysaa #RANABAALI #HappyBirthdayRashmika #HBDRashmikaMandanna #Tollywood #tollywoodactress … pic.twitter.com/MBxRn9UAgE

— BIG TV Cinema (@BigtvCinema) April 5, 2026

మొత్తానికి రష్మిక మందన్న తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ‘మైసా’ చిత్రం ఆమె కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.