|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna:ఆ సమయంలో అలాంటి వీడియోలు చూస్తా.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!

Published: 02-11-2025, 3:43 PM
Rashmika Mandanna:ఆ సమయంలో అలాంటి వీడియోలు చూస్తా.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఖాళీ సమయంలో ఎలాంటి వీడియోలు చూస్తుందో వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Key Points

1

రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.

2

'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోంది.

4

ఖాళీ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో మోటివేషనల్ వీడియోలు చూస్తానని రష్మిక వెల్లడించింది.

రష్మిక కెరీర్, పాన్ ఇండియా స్టార్‌డమ్

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. కిరాక్ పార్టీ, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప, భీష్మ, పుష్ప-2, గీతా ఛలో ఇలా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే.. ప్రస్తుతం రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ (‘The Girlfriend’) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రంలో రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తుండగా దీక్షిత్ శెట్టి(Dhikshith Shetty) హీరోగా కనిపించనున్నాడు. అందమైన లవ్‌స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీస్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల(నవంబర్) 7వ తేదీన గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ ఈవెంట్ లో నేషనల్ క్రష్ రష్మిక మాట్లాడుతూ.. ఖాళీ సమయంలో టైమ్ పాస్ కోసం తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా మోటివేషనల్ వీడియోస్ చూస్తానని చెప్పింది. అలాగే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాలపై కూడా ఆమె ఆసక్తికర అభిప్రాయాలను పంచుకున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7 న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా వివరాలు, విడుదల

ఖాళీ సమయంలో రష్మిక అభిరుచులు, ఆసక్తికర వ్యాఖ్యలు

రష్మిక మందన్న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం నవంబర్ 7న విడుదల కానుండగా, రష్మిక కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.