
📌 Key Points
- రష్మిక మందన్న మునుపెన్నడూ చూడని క్రూరమైన, యోధురాలి లుక్‌లో మెస్మరైజ్ చేసింది.
- `మైసా` సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై అంచనాలను ఆకాశానికి చేర్చింది.
- ఈశ్వరీ రావు వాయిస్‌తో కూడిన శక్తివంతమైన డైలాగ్‌లు గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయి.
- రష్మిక గోండు బిడ్డగా తిరుగుబాటుదారు పాత్రలో కనిపించి మెప్పించింది.
రష్మిక మందన్న `మైసా` సినిమాతో తనలోని కొత్త యాంగిల్‌ను ఆవిష్కరించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఆమె యోధురాలిగా అడవిలో గర్జించిన తీరు అద్భుతం. ఈ చిత్రంలో రష్మిక క్రూరత్వం, పోరాటతత్వం గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రష్మిక మందన్న కొత్త అవతారం: ఊహించని గర్జన
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మొన్నటి వరకు గ్లామర్ పాత్రలతో మెప్పించింది. `పుష్ప2`లోనూ కొంత గ్లామరస్‌గా కనిపించింది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. తనలోని కొత్త యాంగిల్ చూపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మతిపోయేలా చేస్తోంది. ఇటీవల `ది గర్ల్ ఫ్రెండ్` అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఇది విమర్శకుల ప్రశంసలందుకుంది. అలాగే హిందీలో `థామా` అనే మూవీలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డీలా పడింది. కానీ ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాతో వస్తోంది. `మైసా` అనే మూవీలో ఆమె మెయిన్ లీడ్‌గా చేస్తుండటం విశేషం. ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యింది. టీజర్ మాత్రం వాహ్ అనేలా ఉంది. డైలాగ్‌లు అదిరిపోయాయి.
`మైసా` ఫస్ట్ గ్లింప్స్ చూస్తే, `నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే ఒణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాసలేక, గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరి మోయ లేక, అగ్గే బూడిదయ్యింది మండుతున్న నా బిడ్డని చూడలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డని సంపలేక. నా బిడ్డ ఎవరో తెలుసా?` అంటూ టీజర్ సాగగా, రష్మిక మందన్నా గర్జించిన తీరు అదిరిపోయింది. తన యోధురాలు లాంటి కూతురు వీరత్వం గురించి ఒక తల్లి చెప్పిన ఈ మాటలు గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి. వాయిస్ ఇచ్చింది ఈశ్వరీ రావు కావడం విశేషం. ఇందులో రష్మిక మందన్నా గోండు బిడ్డగా కనిపిస్తుంది. ఆమె తిరుగుబాటు చేస్తుంది. రష్మిక పాత్రలో క్రూరత్వం, గాంభీర్యం, తిరుగుబాటు, పోరాడేతత్వం, దేనికైనా తెగించే తత్వం కనిపిస్తున్నాయి. అడవిలో ప్రత్యర్థులను ఒంటరిగా ఎదుర్కోవడం, ఈ క్రమంలో రక్తం మడుగులో ఆమె కనిపించడం విశేషం. ఊరమాస్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది రష్మిక మందన్నా.
మైసా గ్లింప్స్: డైలాగ్‌లు, ఈశ్వరీ రావు వాయిస్
తాజాగా విడుదలైన `మైసా` టీజర్ అదిరిపోయింది. అంచనాలను పెంచింది. రష్మిక మందన్నాని ఇలా ఎప్పుడూ చూడలేదని చెప్పొచ్చు. జస్ట్ వాహ్ అనిపిస్తోంది. మొన్న రష్మిక మందన్నా `థామా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో రాక్షసి పాత్రని పోషించింది. ఆకట్టుకుంది. యాక్షన్‌తోనూ మెప్పించింది. కానీ దాన్ని మించి `మైసా`లో ఆమె పాత్ర ఉండటం విశేషం. గెటప్, లుక్ మాత్రం గూస్ బంమ్స్ తెప్పించేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రెండింగ్‌లోకి వచ్చింది.
గోండు బిడ్డగా రష్మిక: క్రూరత్వం, పోరాటతత్వం
ఇక రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన `మైసా` మూవీకి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర షూటింగ్ తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తుండటం విశేషం.
మొత్తం మీద, రష్మిక మందన్న `మైసా` గ్లింప్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. ఆమె నటన, గెటప్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడం ఖాయం. పూర్తి సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


