
📌 Key Points
- రష్మిక పెళ్లి మేకప్ కోసం 90 నిమిషాలే సమయం పట్టింది.
- హెవీ మేకప్ వద్దని, సింపుల్ లుక్ కావాలని రష్మిక కండిషన్ పెట్టింది.
- కళ్ళకు కాటుక కూడా వద్దని రష్మిక చెప్పడంతో మేకప్ ఆర్టిస్ట్ ఆశ్చర్యపోయారు.
- విజయ్ దేవరకొండతో రష్మిక వివాహం ఫిబ్రవరి 26న జరిగింది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో జరిగింది. రష్మిక తన పెళ్లి మేకప్ విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఆమె కేవలం 90 నిమిషాల్లోనే మేకప్ పూర్తి చేసుకుంది.
రష్మిక పెళ్లి మేకప్ విశేషాలు
Rashmika Mandanna: రష్మిక మందన్న తన చిరకాల ప్రేమికుడు విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26వ తేదీ ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. విజయ్ (Vijay Devarakonda) రష్మిక (Rashmika)ల వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం జరిగినప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి లుక్ విపరీతంగా అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రష్మిక పెళ్లికి సంబంధించిన లుక్ ఎంతోమంది రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక పెళ్లిలో రష్మిక సింపుల్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది అయితే ఈ పెళ్లికూతురు లుక్ వెనుక ఉన్నటువంటి విషయాలను రష్మిక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ (Tanvi Chemburkar) ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రష్మిక పెళ్లి మేకప్ లుక్ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. రష్మిక తన మేకప్ విషయంలో కొన్ని కండిషన్లు పెట్టిందని తెలిపారు. తనకు హెవీ బ్రైడల్ మేకప్ వద్దని సింపుల్ మేకప్ కావాలని కోరినట్టు తెలిపారు. ఇక ఈమె పెళ్లి మేకప్ కేవలం 90 నిమిషాలలో మాత్రమే పూర్తి చేశామని తన్వీ తెలియజేశారు. పెళ్లికి ముందు రోజు రాత్రి ఒక ఈవెంట్ ఉన్న నేపథ్యంలో ఆ ఈవెంట్ పూర్తి అయ్యేసరికి చాలా ఆలస్యమైందనీ,రష్మికకు పెళ్ళికి రెడీ అవ్వడానికి పెద్దగా సమయం కూడా లేకుండా పోయిందని తెలిపారు.
సింపుల్ లుక్ కోసం రష్మిక కండిషన్లు
ఇలా టైం లేకపోవడంతో రష్మిక కేవలం 40 నిమిషాలలో మాత్రమే తన మేకప్ పూర్తి చేయాలి అనే కండిషన్ పెట్టిందని ఇక తామందరం 90 నిమిషాలలో తన మేకప్ పూర్తి చేశామని ఈ సందర్భంగా తన్వీ తెలియజేశారు. పెళ్లిలో హెవీ మేకప్ వద్దని నాచురల్ గా తను ఎలా ఉంటారో అలాంటి లుక్ ఉండాలని కోరారు. కనీసం ఆమె పెళ్లిలో కళ్ళకు కాటుక కూడా వద్దని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని తన్వీ తెలియజేశారు. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి అంటే గంటల తరబడి మేకప్ వేసుకుంటూ ఉంటారు కానీ రష్మిక మాత్రం తన గ్రాండ్ వెడ్డింగ్ కోసం సింపుల్ మేకప్ 90 నిమిషాలలో పూర్తి చేయడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది.
స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్ దేవరకొండ..
వైరల్ అవుతున్న రష్మిక పెళ్లి ఫోటోలు
ఇక రష్మిక పెళ్లికి సంబంధించిన ఫోటోలను సీక్రెట్ గా ఉంచినప్పటికీ పెళ్లి తర్వాత ఈమె వరుసగా తన పెళ్లికి సంబంధించి ప్రతి ఒక్క ఈవెంట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్ కు ఈమె ప్రత్యేకంగా డ్రెస్ డిజైన్ చేయించుకొని పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక పెళ్లిలో విజయ్ దేవరకొండ లుక్ కూడా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
చివరిగా, రష్మిక తన పెళ్లిలో సింపుల్ మేకప్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తీసుకున్న నిర్ణయాలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


