|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika: ప్రభాస్‌ సరసన రష్మిక.. నా బాడీని తీసుకెళ్లండన్న నెటిజన్!

Published: 03-11-2025, 11:39 AM
Rashmika: ప్రభాస్‌ సరసన రష్మిక.. నా బాడీని తీసుకెళ్లండన్న నెటిజన్!

నటి రష్మిక తన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె నెటిజన్లతో చాట్ చేస్తూ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ప్రభాస్‌తో కలిసి నటించడంపై ఓ నెటిజన్ వేసిన ఫన్నీ ప్రశ్న, దానికి రష్మిక ఇచ్చిన ఆసక్తికర సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Key Points

1

రష్మిక నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రం నవంబర్‌ 7న విడుదల కానుంది.

2

ప్రమోషన్లలో భాగంగా రష్మిక నెటిజన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించింది.

4

ప్రభాస్‌తో నటించడం తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని రష్మిక తెలిపింది.

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ప్రమోషన్లలో రష్మిక

రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్‌ శెట్టి శెట్టి హీరోగా నటించారు . ఈ మూవీ నవంబర్‌ 7న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్ . రష్మిక సైతం ప్రమోషన్స్‌లో దూసుకెళ్తోంది . ఇటీవలే బిగ్ ‌ బాస్ ‌ షోలోనూ సందడి చేసింది .

ప్రభాస్‌తో నటించడంపై నెటిజన్ ప్రశ్న, రష్మిక రిప్లై

తాజాగా ది గర్ల్ ‌ ఫ్రెండ్ ‌ మూవీ ప్రమోషన్లలో భాగంగా నెటిజన్స్ ‌ తో చిట్ ‌ చాట్ నిర్వహించింది . రష్ ‌ అవర్ పేరుతో ట్విటర్ ‌ వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది . దీంతో ఓ నెటిజన్ కాస్తా విభిన్నమైన ప్రశ్న వేశాడు . వీలైతే మీరు ప్రభాస్ ‌ తో కలిసి నటిస్తారా ? అలా జరిగితే మీ కాంబో హైప్ ‌ దెబ్బకు థియేటర్ నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా అడిగాడు . దీనికి స్పందించిన రష్మిక .. ప్రభాస్ ‌ తో నటించడం నాకు కూడా ఇష్టమే .. ఒకవేళ ప్రభాస్ ఈ మేసేజ్ ‌ చూస్తారని ఆశిస్తున్నా .. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్ ‌ లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది . ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ ‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు .

ప్రభాస్‌-రష్మిక కాంబోపై గత వార్తలు

కాగా .. గతంలో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి . కానీ చివరికీ బాలీవుడ్ భామ , యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఆ ఛాన్స్ కొట్టేసింది . యానిమల్ ‌ చిత్రంలో రష్మిక హీరోయిన్ ‌ గా నటించిన సంగతి తెలిసిందే . ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్ ‌ ను తన ఖాతాలో వేసుకుంది . ప్రస్తుతం ది గర్ల్ ‌ ఫ్రెండ్ ‌ చిత్రంతో మరోసారి అలరించేందుకు వస్తోంది .

రష్మిక, ప్రభాస్‌ కాంబోపై నెటిజన్ల ఆసక్తి ఆమె సమాధానంతో మరింత పెరిగింది. భవిష్యత్తులో ఈ ఇద్దరు స్టార్స్‌ కలిసి నటించే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.