|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రష్మిక – విజయ్ పెళ్లికి 100 కోట్ల ఆఫర్! రౌడీ కపుల్ ఏం చేస్తారో తెలుసా?

Published: 14-02-2026, 1:35 AM
షాకింగ్: రష్మిక - విజయ్ పెళ్లికి 100 కోట్ల ఆఫర్! రౌడీ కపుల్ ఏం చేస్తారో తెలుసా?
  • రష్మిక, విజయ్ పెళ్లి వీడియో రైట్స్ కోసం ఓటీటీ సంస్థ ఏకంగా 100 కోట్ల ఆఫర్!
  • ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం జరగనున్నట్లు సమాచారం.
  • నయనతార పెళ్లి వీడియో హక్కులను నెట్‌ఫ్లిక్స్ 25 కోట్లకు కొనుగోలు చేసింది.
  • హన్సిక పెళ్లి వీడియో కూడా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. వీరి పెళ్లి వీడియో కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

రష్మిక, విజయ్ పెళ్లికి భారీ ఓటీటీ ఆఫర్!

ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. సెలబ్రిటీల పెళ్లి వీడియోలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కొనుగోలు చేసి, తమ యాప్‌లో స్ట్రీమ్ చేయడం కొత్త ట్రెండ్ అయింది. దీనికోసం కోట్లు కుమ్మరించడానికి కూడా ఓటీటీలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లికి కూడా ఇలాంటి భారీ ఆఫరే వచ్చిందట. రష్మిక-విజయ్ పెళ్లి వీడియో కోసం ఓ ఓటీటీ సంస్థ ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఈ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరగనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని అంటున్నారు. అయితే వీరు లాస్ట్ ఇయర్ జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ సమయంలోనే, వీరి పెళ్లి విషయంలో కూడా ఇదే రహస్యాన్ని పాటించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వీడియోను షూట్ చేసి, స్ట్రీమింగ్ చేసే హక్కుల కోసం చాలా ఓటీటీలు పోటీ పడుతున్నాయట. ఓ పెద్ద ఓటీటీ సంస్థ అయితే, పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రసారం చేసే హక్కు ఇస్తే ఏకంగా 100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు టాక్.

100 కోట్లు ఆఫర్ చేసిన ఓటీటీ సంస్థ!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పెళ్లి వీడియో హక్కులను ఓటీటీలు కొనుగోలు చేస్తున్నాయి. వాటిని తమ ప్లాట్‌ఫామ్‌లపై ప్రసారం చేసి, వ్యూయర్స్ నుంచి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇప్పుడు అదే విధంగా రష్మిక-విజయ్ పెళ్లి వేడుకను షూట్ చేసి అభిమానులకు చూపించాలని ఓ ఓటీటీ సంస్థ ప్లాన్ చేస్తోంది. 2024 నవంబర్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు.

వీరి వీడియో హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ప్రస్తుతం అది ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో డాక్యుమెంటరీ రూపంలో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో నయనతార తన సినిమా, వ్యక్తిగత జీవితం, గతంలో ఎదురైన నమ్మకద్రోహాలు, విఘ్నేశ్‌తో ప్రేమ ఎలా పుట్టింది అనే విషయాల గురించి కూడా మాట్లాడారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి వీడియో కూడా హాట్‌స్టార్‌లో చూడొచ్చు. 2022 డిసెంబర్‌లో వ్యాపారవేత్త సోహైల్‌ను హన్సిక గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి వీడియోతో పాటు, హన్సిక ప్రేమ ప్రయాణాన్ని చూపిస్తూ ‘హన్సికాస్ లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఈ డాక్యుమెంటరీ ఓటీటీలో అందుబాటులో ఉంది. వీరితో పాటు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పెళ్లి ఫోటోలను ప్రచురించుకోవడానికి ఓ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు పెద్ద మొత్తానికి అమ్ముకున్నారు. ఇక గత ఏడాది పెళ్లి చేసుకున్న నాగచైతన్య-శోభిత పెళ్లి వీడియో కోసం నెట్‌ఫ్లిక్స్ 50 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం.

నయనతార, హన్సిక బాటలో రష్మిక, విజయ్?

అయితే, నాగచైతన్య-శోభిత ఈ ఓటీటీ ఆఫర్‌ను తిరస్కరించారని తెలుస్తోంది.  ఎందుకంటే, ఓటీటీ వాళ్లు కేవలం పెళ్లి వీడియో షూట్ చేయడానికి ఇంత పెద్ద మొత్తం ఇవ్వరు. బదులుగా ఆ సెలబ్రిటీల పాత ఎఫైర్లు, బ్రేకప్ అయిన ప్రేమకథలు అన్నింటినీ తవ్వుతారు. ఆ తర్వాత ఈ ప్రేమ ఎలా మొదలైంది, పెళ్లి ఎలా జరిగింది అని చూపిస్తారు. సో, ఒకరకంగా చెప్పాలంటే పర్సనల్ లైఫ్‌ను కెమెరా ముందు బట్టబయలు చేసినందుకే ఓటీటీలు ఇంత డబ్బు ఇస్తాయన్నమాట!

ఇక తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక కూడా తమకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన 100 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. తమ లైఫ్‌ను కెమెరా ముందు పూర్తిగా పెట్టడానికి ఈ జంట నో చెప్పిందట. కేవలం తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే పెళ్లిని చాలా ప్రైవేట్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం విషయం వైరల్ అవుతోంది. ఏదేమైనా, సెలబ్రిటీల పెళ్లికి ఓటీటీలు కోట్లు ఇస్తాయన్నది నిజమే. కానీ, ఆ కోట్లకు బదులుగా సున్నితమైన విషయాలన్నింటినీ కెమెరా ముందు ఉంచి బేరం పెట్టాల్సి వస్తుంది. అందుకేనేమో విజయ్-రష్మిక ఈ ఓటీటీ పెళ్లికి దూరంగా ఉన్నారేమో.?

రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. అప్పటి వరకు వేచి చూడండి! తాజా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.