
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల గ్రాండ్ వెల్కం పిక్స్ వైరల్
- కొడవ సంప్రదాయంలో రష్మిక మెరుపులు, విజయ్ దేవరకొండ సందడి
- రాజస్థాన్‌లో సీక్రెట్ వెడ్డింగ్, ఇప్పుడు గ్రాండ్ రిసెప్షన్!
- కూతురికి ఇంటిని బహుమతిగా ఇచ్చిన రష్మిక తండ్రి మదన్ మందన్న!
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్. వీరి రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
రష్మిక, విజయ్ సీక్రెట్ వెడ్డింగ్ వెనుక అసలు కథ
సుమారు నెలన్నర క్రితం రాజస్థాన్‌లో చాలా ప్రైవేట్‌గా పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తాాజాగా మందన్న కుటుంబ సభ్యులు, బంధువుల కోసం విరాజ్‌పేట్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో రష్మిక మందన్న కొడవ ట్రెడిషన్ శారీలో మెరిసిపోయింది.
విరాజ్‌పేటలోని అందమైన ‘సెరినిటీ హాల్’ లో ఈ స్టార్ కపుల్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. కొడవ సంప్రదాయ పద్ధతులతో ఈ వేడుక జరిగింది. ఫంక్షన్ హాల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, ఆహ్వానితులకు మాత్రమే లోపలికి అనుమతించారు.
కొడవ సంప్రదాయంలో గ్రాండ్ రిసెప్షన్ అదుర్స్!
రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎలాంటి హడావుడి లేకుండా జరిగింది. ఆ పెళ్లికి వెళ్లలేని బంధువుల కోసం మందన్న కుటుంబం ఈ ప్రత్యేక రిసెప్షన్‌ను ఏర్పాటు చేసింది. పెళ్లయిన నెలన్నర తర్వాత ఈ కార్యక్రమం జరగడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
ఈ రిసెప్షన్‌కు హీరో విజయ్ దేవరకొండ కుటుంబం నుంచి కూడా కొంతమంది ముఖ్యమైన అతిథులు హాజరయ్యారు. విజయ్ తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితులు కొడగు ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అల్లుడి కుటుంబానికి కొడవ సంస్కృతి, ఆహారపు అలవాట్లను పరిచయం చేశారు. విజయ్ దేవరకొండకు గ్రాండ్ వెల్కం చెప్పి.. కొత్తల్లుడికి కావల్సిన మర్యాదలు చేశారు.
కూతురికి తండ్రి గిఫ్ట్.. ఆస్తి మొత్తం రష్మికదేనా?
సెలబ్రిటీల కార్యక్రమం కావడంతో, కుటుంబ సభ్యులు ఈ వేడుకను చాలా ప్రైవేట్‌గా నిర్వహించారు. కేవలం సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం పంపారు. మీడియాకు కూడా అనుమతి లేదని సమాచారం. ‘గీత గోవిందం’లో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటై తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
పెళ్లి తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చిన కూతురు రష్మిక మందన్నకు ఆమె తండ్రి మదన్ మందన్న ఖరీదైన కానుకను అందించాడు. ఏకంగా తమ ఇంటినే కూతురికి బహుమతిగా ఇచ్చారు.
విజయ్, రష్మికల పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి!


