
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్టార్ జంట నికర ఆస్తులు, వ్యాపారాలు, సంపాదనపై చర్చ జోరుగా సాగుతోంది. వారి ఆస్తుల విలువ, వ్యాపార పెట్టుబడుల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Key Points
రష్మిక, విజయ్ అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని వారి టీమ్ సమాచారం ఇచ్చింది.
విజయ్ దేవరకొండ నికర ఆస్తి దాదాపు 70 కోట్ల రూపాయల పైనే అని నివేదికలు చెబుతున్నాయి.
రష్మిక మందన్న నికర ఆస్తి సుమారు 66 కోట్ల రూపాయల పైనే అని సమాచారం.
విజయ్‌కి రౌడీ వేర్, AVD సినిమాస్, వాలీబాల్ టీమ్, నిర్మాణ సంస్థ వంటి వ్యాపారాలున్నాయి.
రష్మిక – విజయ్ సంబంధం, నిశ్చితార్థం వార్తలు
Rashmika Vijay : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ఇటీవల అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని వాళ్ళ టీమ్ మీడియాకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. గీత గోవిందం సమయంలో వీరిద్దరికి పరిచయం అయింది. డియర్ కామ్రేడ్ సమయంలో వీరి బంధం మరింత బలపడింది.(Rashmika Vijay)
వీళ్ళు ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు హింట్స్ ఇస్తూ వెకేషన్ కి వెళ్లిన ఫొటోలు, పండగల ఫొటోలు షేర్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇద్దరూ కెరీర్లో మంచి పొజిషన్ లో ఉండి వరుస సినిమాలతో దూసుకెల్తూ బాగానే సంపాదిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఆస్తి, వ్యాపార వివరాలు
ఈ జంట ఇద్దరికీ ఎంత ఆస్తి ఉంది, వీళ్లకు ఎన్ని బిజినెస్ లు ఉన్నాయి, వీళ్లిద్దరు కలిస్తే ఎంత ఆస్తి అవుద్ది అని సోషల్ మీడియాలో చర్చగా మారింది. గతంలో పలు నివేదికలు ఇచ్చిన వివరాల ప్రకారం వీరిద్దరి ఆస్తుల గురించి చర్చిస్తున్నారు.
పలు నివేదికల ప్రకారం విజయ్ దేవరకొండ నెట్ వర్త్ దాదాపు 70 కోట్ల పైనే అట. విజయ్ సినిమాల్లో సంపాదించడం మొదలుపెట్టాక మొదట తన కలల ఇంటిని కట్టుకున్నాడు. దాని విలువ దాదాపు 15 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే విజయ్ చేతిలో పలు బ్రాండ్స్ ఉన్నాయి. వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ ఒక్కోదానికి కోటి రూపాయలు తీసుకుంటాడని టాక్. ఇక సినిమాల పరంగా విజయ్ ఒక్కో సినిమాకు దాదాపు 12 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడట. అలాగే విజయ్ కి రౌడీ వేర్ అనే క్లాతింగ్ బిజినెస్ ఉంది. మహబూబ్ నగర్ లో విజయ్ కి AVD సినిమాస్ అని మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది. అంతే కాకుండా ఓ వాలీబాల్ టీమ్ కి కో ఓనర్ కూడా. కింగ్ ఆఫ్ ది హిల్ అనే సినిమా నిర్మాణ సంస్థ కూడా ఉంది. అలాగే పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టాడని సమాచారం. ఖరీదైన కార్లు అదనం.
రష్మిక మందన్న ఆస్తుల పూర్తి సమాచారం
ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే.. ఆమెకు దాదాపు 66 కోట్లకు పైగా నెట్ వర్త్ ఉందని పలు నివేదికల సమాచారం. రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 నుంచి 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్ లో అయితే ఇంకా ఎక్కువే. ఇక రష్మిక ఇటీవలే ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ తో బిజినెస్ మొదలుపెటింది. రష్మిక చేతిలో కూడా దాదాపు ఎనిమిది బ్రాండ్స్ ఉన్నాయి. వీటికి బ్రాండ్ అంబాసిడర్ గా బాగానే సంపాదిస్తుంది. అలాగే ఆమె కుటుంబానికు చెందిన వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. బెంగుళూరులో 8 కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఖరీదైన కార్లు కూడా. ఇక ఈ ఇద్దరికీ సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కూడా డబ్బులు బాగానే వస్తాయి. మొత్తానికి విజయ్ – రష్మిక కలిస్తే దాదాపు 140 కోట్లకు పైగా నెట్ వర్త్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
రష్మిక, విజయ్ ఇద్దరూ తమ కెరీర్‌లో మంచి స్థితిలో ఉంటూ భారీగా సంపాదిస్తున్నారు. వారి వ్యక్తిగత, వ్యాపార ఆస్తులు కలిసి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నాయి. అభిమానులు వారి భవిష్యత్తు కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నారు.


