
📌 Key Points
- రష్మిక మందన్న ‘మైసా’ కోసం అండర్ వాటర్ ఫైట్ సీన్ చేసిన తొలి హీరోయిన్.
- వరుసగా రెండు రోజుల పాటు 20 గంటలు నీటిలోనే గడిపి ప్రమాదకరమైన సీన్.
- డూప్ వాడకుండా స్వయంగా యాక్షన్ మూవ్మెంట్స్ చేసిన రష్మిక.
- సినిమా టీమ్ మొత్తం రష్మిక డెడికేషన్ చూసి షాక్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కొత్త సినిమా ‘మైసా’ కోసం ఓ ప్రమాదకరమైన ఫైట్ సీన్ చేసి రికార్డ్ సృష్టించారు. ఆమె చేసిన ఈ సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అండర్ వాటర్ ఫైట్ చేసిన తొలి హీరోయిన్ రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో రష్మిక ఒక గోండ్ తెగకు చెందిన గిరిజన యువతిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఎంతో ఎమోషనల్ గానే కాకుండా, శారీరకంగా కూడా చాలా కష్టపడుతున్నారు. తాజాగా ఆమె ఈ సినిమా కోసం చేసిన ఒక సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘మైసా’ కోసం రష్మిక ఒక అత్యంత కష్టమైన, ప్రమాదకరమైననీటి అడుగున ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు.
వరుసగా రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల సమయం ఆమె నీటిలోనే గడుపుతూ ఈ ఫైట్ సీన్స్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక హీరోయిన్ ఇలాంటి ‘అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్’ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంత రిస్క్ ఉన్నప్పటికీ రష్మిక ఎక్కడా డూప్ వాడటానికి ఒప్పుకోలేదట. సీన్ ఎంతో రియలిస్టిక్ గా రావాలనే ఉద్దేశంతో ప్రతి యాక్షన్ మూమెంట్‌ను ఆమె సొంతంగానే చేసినట్లు తెలుస్తోంది. రష్మిక చూపిస్తున్న ఈ డెడికేషన్ చూసి సినిమా టెక్నికల్ టీమ్ ,అండర్ వాటర్ క్రూ మొత్తం షాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నీటి అడుగున జరిగే ఫైట్ కేవలం ఒక యాక్షన్ సీన్ మాత్రమే కాదని, ఎంతో భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ సినిమాకే అతిపెద్ద విజువల్ హైలైట్‌గా నిలవబోతోందని సమాచారం.
20 గంటలు నీటిలోనే గడిపి రిస్కీ సీన్ పూర్తి
డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేసిన రష్మిక
రష్మిక మందన్న డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మైసా’ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూద్దాం. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


