|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘BMW’: ఇద్దరి భవితవ్యం మలుపు తిరుగుతుందా? సంక్రాంతి పోరులో ఎవరు గెలుస్తారు?

Published: 11-01-2026, 6:00 AM
రవితేజ 'BMW': ఇద్దరి భవితవ్యం మలుపు తిరుగుతుందా? సంక్రాంతి పోరులో ఎవరు గెలుస్తారు?
  • రవితేజ కెరీర్‌కు ‘భర్త మహాసాయలకు విజ్ఞప్తి’ చిత్రం కీలకం కానుంది.
  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు యూత్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కథనాలుగా నిలిచాయి.
  • ఈ సినిమా ఒక వివాహిత వ్యక్తి చుట్టూ తిరిగే ప్రేమ త్రికోణం నేపథ్యంలో సాగుతుంది.
  • సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా రవితేజ, కిషోర్ తిరుమల ఇద్దరికీ టర్నింగ్ పాయింట్ కానుంది.

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన రవితేజ, ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘భర్త మహాసాయలకు విజ్ఞప్తి’ చిత్రం వారిద్దరి కెరీర్‌కు చాలా కీలకం కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

రవితేజ కెరీర్‌కు కీలకం కానున్న ‘BMW’

Ravi Teja BMW: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన హీరో రవితేజ గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య..వంటి సినిమాల తర్వాత వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో రవితేజ కెరీర్‌పై అభిమానుల్లో కొంత ఆందోళన కనిపించింది. ఇప్పుడు అదే పరిస్థితిని మార్చే సినిమాగా..భర్త మహాసాయలకు విజ్ఞప్తి (BMW)పై అందరి చూపు పడింది.

ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్ తిరుమల అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎమోషనల్ కథలు.. యూత్‌కు కనెక్ట్ అయ్యే సున్నితమైన కథనాలు. ఆయన దర్శకత్వంలో వచ్చిన నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ, శైలజా రెడ్డి అల్లుడు.. ఈ సినిమాలు అన్నీ కూడా కామెడీతో పాటు ఎమోషన్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అయితే ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన దారిలో వెళ్లి ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను.. తీసుకొస్తున్నాడు.

భర్త మహాసాయలకు విజ్ఞప్తి కథ ఒక వివాహిత వ్యక్తి చుట్టూ తిరిగే ప్రేమ త్రికోణం నేపథ్యంలో సాగుతుంది. ఈ కథను సరదాగా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా చూపించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్, టీజర్‌లకు వచ్చిన స్పందన చాలా పాజిటివ్‌గా ఉంది. మొదటి సీన్ నుంచే నవ్వులు పూయించేలా సినిమా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సరికొత్త ప్రయత్నం

ఈ సినిమా విషయంలో కిషోర్ తిరుమల చాలా ప్లాన్‌తో ముందుకు వెళ్లారు. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడం..ఆ తర్వాత దూకుడుగా ప్రమోషన్లు చేయడం.. ఇలా అన్ని.. కలిపి సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా పండగ సీజన్‌లో పెద్ద సినిమాల మధ్య పోటీ ఉన్నా కూడా భర్త మహాసయులకు విజ్ఞప్తి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో రవితేజ సినిమాకు ఇంత పాజిటివ్ బజ్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

ప్రమోషన్లలో కూడా కిషోర్ తిరుమల ప్రత్యేకంగా కనిపించారు. వరుస ఇంటర్వ్యూలు.. స్టేజ్‌పై హీరోయిన్లతో కలిసి డాన్స్ చేయడం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమా రవితేజకు మాత్రమే కాదు..కిషోర్ తిరుమలకు కూడా చాలా కీలకం. రవితేజకు ఇది ఒక రీ-ఎంట్రీ లాంటి సినిమా అయితే, కిషోర్ తిరుమలకు కొత్త జానర్‌లో తన సత్తా చూపించే అవకాశం. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అయితే ఇద్దరి కెరీర్‌లకు ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది.

సంక్రాంతి బరిలో నిలిచే ‘భర్త మహాసాయలకు విజ్ఞప్తి’

SLV బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ‘భర్త మహాసాయలకు విజ్ఞప్తి’ జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి పండగకు కుటుంబంతో కలిసి చూసేందుకు ఇది ఒక మంచి ఎంటర్‌టైనర్ అవుతుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.

మొత్తానికి ‘భర్త మహాసాయలకు విజ్ఞప్తి’ చిత్రం రవితేజకు ఒక రీ-ఎంట్రీ సినిమా అయితే, కిషోర్ తిరుమలకు కొత్త జానర్‌లో తన సత్తా చాటే అవకాశం. ఈ సినిమా ఇద్దరికీ టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.