|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ravi Teja RT76 షూటింగ్ స్టార్ట్.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Published: 17-06-2025, 7:47 AM
Ravi Teja RT76 షూటింగ్ స్టార్ట్.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

మాస్ మహారాజా రవితేజ 76వ చిత్రం RT76 షూటింగ్ ప్రారంభమైంది. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల తేదీలకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

RT76 షూటింగ్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో పాటు రవితేజ లేటెస్ట్‌గా తన 76వ సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. RT-76 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ (Kishore) దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌లో ఈ చిత్రం వస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. RT-76 మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

దీంతో ఈ మూవీ సెట్స్ మీదకు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని రవితేజ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా RT-76కి సంబంధించిన షూటింగ్ అప్డేట్‌తో పాటు, టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘టాకీ పార్ట్ చిత్రీకరణతో RT76 సెట్స్ పైకి దూసుకుపోతోంది. టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తాము. 2026 సంక్రాంతికి సినిమా థియేటర్లలోకి రాబోతుంది’ అని తెలిపారు. కాగా.. ప్రస్తుతం స్టార్ట్ అయినా టాకీ పార్ట్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో రవితేజ తనదైన కంఫర్ట్ జోన్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నాడని టాక్.

టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల తేదీ

సినిమా విడుదల తేదీ

చివరగా, రవితేజ RT76 సినిమా షూటింగ్ ప్రారంభమై, 2026 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ మరియు టైటిల్ త్వరలోనే విడుదల అవుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.