|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ థియేటర్‌ ప్రారంభం.. ఫస్ట్‌ సినిమా ఏదంటే..?

Published: 29-07-2025, 12:13 AM
రవితేజ థియేటర్‌ ప్రారంభం.. ఫస్ట్‌ సినిమా ఏదంటే..?

టాలీవుడ్ స్టార్ రవితేజ తన సొంత థియేటర్ నిర్మించి సినీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ART మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. జులై 31న ప్రారంభోత్సవం.

Key Points

1

మాస్ మహారాజా రవితేజ తన సొంత మల్టీప్లెక్స్ నిర్మించారు.

2

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో 6 స్క్రీన్లతో ART మల్టీప్లెక్స్ ప్రారంభం.

4

అత్యాధునిక సదుపాయాలతో, సినిమా ప్రేమికులకు అద్భుతమైన అనుభవం.

రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం

మాస్‌మహారాజా రవితేజ థియేట‌ర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు . ఏషియన్ ‌ సినిమాస్ ‌ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్ ‌ లో లగ్జరీ మల్టీఫ్లెక్స్ ‌ ను ఆయన నిర్మించారు . ఇప్పటికే మహేశ్ ‌ బాబు , అల్లు అర్జున్ ‌, విజయ్ ‌ దేవరకొండ ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు . తాజాగా రవితేజ్ ‌ కూడా ఆరు స్క్రీన్లతో వనస్థలిపురంలో మల్టీఫ్లెక్స్ ‌ ను ఏర్పాటు చేశారు . జులై 31 న ప్రారంభోత్సవం జరగనుంది .

‘కింగ్డమ్’ సినిమాతో ప్రారంభోత్సవం

ART ( ఏషియ‌న్ ర‌వితేజ ) మల్టీఫ్లెక్స్ ‌ లో తొలి సినిమా ‘ కింగ్డమ్ ‌’ ప్రదర్శించనున్నారు . ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు . అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ ‌ మీడియాలో వైరల్ ‌ అవుతున్నాయి . ఈస్ట్ ‌ హైదరాబాద్ ‌ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్ ‌ గా ART నిలవనుంది . సుమారు 60 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ .. ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ‌ తో పాటు సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించే విధంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.

అత్యాధునిక సదుపాయాలు

రవితేజ థియేటర్ ‌ లో ‘ కింగ్డమ్‌’ తొలి సినిమా కావడంతో విజయ్ ‌ దేవరకొండ అభిమానులు ఫుల్ ‌ జోష్ ‌ లో ఉన్నారు . ఈ క్రమంలో వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు . గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ ‌ లో భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ థియేటర్ ప్రారంభంతో సినిమా ప్రేమికులకు కొత్త అనుభవం లభించనుంది. ‘కింగ్డమ్’ సినిమాతో ప్రారంభమయ్యే ఈ మల్టీప్లెక్స్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.