|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘BMW’: సత్యతో కలిసి మాస్ స్టెప్పులు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

Published: 12-01-2026, 9:00 AM
రవితేజ 'BMW': సత్యతో కలిసి మాస్ స్టెప్పులు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
  • రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల!
  • ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా రవితేజతో కలిసి నటించారు.
  • సత్యతో కలిసి రవితేజ మాస్ స్టెప్పులు.. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాట రీమిక్స్!
  • కిషోర్ తిరుమల దర్శకత్వం, భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు.

మాస్ మహారాజ్ రవితేజ తన కొత్త సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సంక్రాంతికి రవితేజ మాస్ ట్రీట్!

మాస్ మహారాజ్ రవితేజ ( Ravi Teja) లేటెస్ట్ గా నటించిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి ( Bhartha Mahasayulaku Wignyapthi). సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. అంటే రేపు థియేటర్లలో ఈ సినిమా ఆడనుంది. రవితేజ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ , డింపుల్ హయాతి హీరోయిన్ గా మెరువనున్నారు. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, సునీల్ కూడా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల ( Kishore Tirumala ) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉన్నారు. భీమ్స్ సంగీత స్వరాలు అందించారు.

సత్యతో కలిసి ఊర మాస్ స్టెప్పులు!

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటలు యూట్యూబ్ లో షేక్ చేస్తున్నాయి. అటు దర్శకుడు తిరుమల కిషోర్, ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులు కూడా వేస్తున్నారు. అయితే ఇంకా అయిపోలేదు… మా సినిమాలో మరింత ఉంది అంటూ మరో షాకింగ్ ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో కమెడియన్ సత్యతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఎల్లువొచ్చి గోదారమ్మ అనే పాత పాట‌ను దీని కోసం వాడుకున్నారు. ఇందులో ఓ అందాల తార‌తో క‌మెడీయ‌న్ స‌త్య స్టెప్పులు వేశాడు. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు రోజు ఈ ప్ర‌క‌ట‌న చేసి, సినిమా హైప్ పెంచారు.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్ అప్డేట్స్

A post shared by SLV Cinemas (@slv_cinemas)

రవితేజ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం థియేటర్లలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.