
టాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రాయలసీమ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు మళ్ళీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి! స్టార్ హీరోలు సైతం ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని, తమ సినిమాలను హిట్ బాట పట్టిస్తున్నారు. ఈ పంథా వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? తెలుసుకుందాం!
Key Points
సమంత 'మా ఇంటి బంగారం' రాయలసీమ యాసతో బ్లాక్‌బస్టర్.
అఖిల్ 'లెనిన్' చిత్తూరు యాసతో సక్సెస్ టాక్.
విజయ్ దేవరకొండ 'రణబాలి' కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో.
వెంకటేష్-కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ఫ్యాక్షన్ కామెడీగా రాబోతోంది.
రాయలసీమ: ఒకప్పుడు.. ఇప్పుడు.. రేపు!
Rayalaseema : ఒకప్పుడు టాలీవుడ్ లో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు అన్ని ఆల్మోస్ట్ హిట్టే. బాలయ్య బాబు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీసుకొచ్చిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను మెప్పించాయి. వెంకటేష్, చిరంజీవి కూడా ఇంద్ర, జయం మనదేరా, తులసి.. లాంటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలతో వచ్చి అదరగొట్టారు. 1995 – 2010 మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో అంతఃపురం లాంటి యాక్షన్, ఫ్యాక్షన్, సీమశాస్త్రి లాంటి కామెడీ జానర్స్ లో అనేక సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. మర్యాద రామన్న తర్వాత ఆ హవా తగ్గింది.
ఆ తర్వాత రాయలసీమ బ్యాక్ డ్రాప్ కి కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వచ్చి హిట్ కొడుతుండటంతో చర్చగా మారింది. ఇటీవల సమంత మా ఇంటి బంగారం సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సమంత ఆ యాస మాట్లాడి హిట్ కొట్టింది. తాజాగా అక్కినేని అఖిల్ కూడా లెనిన్ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే తీసుకువచ్చాడు. అఖిల్ కూడా చిత్తూరు యాసలో మాట్లాడి మెప్పించాడు. లెనిన్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
ఆ యాస పట్టుకుంటే చాలు.. హిట్టే!
ఇలా బ్యాక్ టు బ్యాక్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వచ్చి హిట్ కొట్టడంతో మళ్ళీ ఆ పంథా సినిమాలపై ఆసక్త్ నెలకొంది. విజయ్ దేవరకొండ రాబోయే రణబాలి సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే. అనిల్ రావిపూడి రాబోయే సినిమా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ల సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్, కామెడీతో ఉండబోతుంది. ఈ సినిమా ఎలాగో హిట్ అని అందరికి తెలుసు. ఇలా వరుసగా రాయలసీమ సినిమాకు క్యూ కట్టాయి టాలీవుడ్ లో.
వరుస కడుతున్న స్టార్ హీరోల సినిమాలు!
రాయలసీమ యాస ని పర్ఫెక్ట్ గా పట్టుకొని కరెక్ట్ గా మాట్లాడితే చాలు జనాలకు కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అవ్వడం ఖాయం అని అనుకుంటున్నారు. మరి రాబోయే రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా హిట్ కొట్టేస్తే మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వరుసగా రావడం ఖాయం.
రాయలసీమ నేపథ్యంలో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, త్వరలో మరిన్ని సంచలన చిత్రాలు రావడం ఖాయం! టాలీవుడ్ లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని చూస్తూనే ఉండండి!


