|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ అప్‌డేట్: RC17లో రష్మిక కన్ఫర్మ్? సుకుమార్ షాకింగ్ డెసిషన్!

Published: 21-07-2026, 8:22 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో RC17 భారీ అంచనాలు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

Key Points

1

RC17: రామ్ చరణ్, సుకుమార్ కాంబో మళ్లీ

2

హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు హాట్

3

పుష్ప ఫేమ్ రష్మికకు పాన్-ఇండియా క్రేజ్

4

స్క్రిప్ట్ వర్క్ పూర్తి, షూటింగ్ త్వరలో

రామ్ చరణ్ 17వ చిత్రంలో రష్మికా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన తన 17వ చిత్రాన్ని (RC17) సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌తో కలసి చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంపై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌లోని హీరోయిన్ గురించి రోజుకొక వార్త హల్‌చల్ చేస్తోంది. నిన్నటి వరకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు గట్టిగా వినిపించగా.. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందానా లైన్లోకి వచ్చింది. ఇందులో రామ్ చరణ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. * పెళ్లి పీటలెక్కుతున్న ‘బస్ స్టాప్’ హీరో.. ఎన్నారై భామతో ప్రిన్స్ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సిరీస్‌తో రష్మికకు దేశవ్యాప్తంగా అపారమైన ఆదరణ దక్కింది. ఆ చిత్రంలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘RC17’లో రాసుకున్న ఒక బలమైన, పవర్‌ఫుల్ మహిళా పాత్రకు రష్మిక అయితేనే సరైన న్యాయం చేయగలరని, ఆమెకున్న పాన్-ఇండియా పాపులారిటీ కూడా సినిమాకి అదనపు బలంగా మారుతుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. చరణ్ మాస్ ఇమేజ్, సుకుమార్ అద్భుతమైన నెరేషన్, దానికి తోడు రష్మిక గ్లామర్ అండ్ యాక్టింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపికపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. * బాలయ్య vs ఐశ్వర్య రాజేశ్… కొరటాల శివ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో హోమ్లీ బ్యూటీ! రష్మిక ప్రస్తుతం తన భర్త అయిన విజయ్ దేవరకొండ సరసన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అనే చిత్రంలో నటిస్తోంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. 19వ శతాబ్దంలో రాయలసీమ కరువు సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక మరుగున పడిన యోధుడి యదార్థ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు.

సుకుమార్ డైరెక్షన్‌లో మరో మాస్ ఎంట్రీ

ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే

RC17పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. హీరోయిన్ ఎంపికపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. మరిన్ని అప్‌డేట్ల కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.