|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు! నెటిజన్ల దారుణ ట్రోలింగ్స్!!

Published: 02-03-2026, 10:05 AM
షాకింగ్: సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు! నెటిజన్ల దారుణ ట్రోలింగ్స్!!
  • రేణు దేశాయ్ పై దారుణ ట్రోలింగ్స్, అసభ్యకర కామెంట్లతో విరుచుకు పడ్డ నెటిజన్లు!
  • సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ పై అసభ్యకర పదజాలంతో దూషణలు, దిమ్మతిరిగే షాకింగ్ కామెంట్స్!
  • సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు, దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి!
  • జనవరిలో NGOల తరపున ప్రెస్ మీట్ పెట్టిన రేణుదేశాయ్, కుక్కల గురించి మాట్లాడినందుకు దారుణంగా ట్రోల్ చేశారు!

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర కామెంట్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రేణు దేశాయ్ పై ట్రోలింగ్స్

Renu Desai : సెకండ్ ఇన్నింగ్స్ లో రేణు దేశాయ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల కుక్కల గురించి ప్రెస్ మెట్ పెట్టి మరీ మాట్లాడటంతో రేణు దేశాయ్ వైరల్ గా మారింది. దీంతో పలువురు రేణు దేశాయ్ ని ఆ కుక్కలు నిన్ను కరిస్తే తెలుస్తుంది అంటూ అసభ్యకరమైన పదాలతో, భూతులతో తిట్టారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

రెండు రోజుల క్రితం దీనిపై రేణు దేశాయ్ ఓ వీడియో షేర్ చేసి.. నా డైవర్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వింటూనే ఉన్నాను. అన్ని అయిపోయాయి అనుకున్నా కానీ రీసెంట్ గా జనవరిలో కుక్కల కోసం ప్రెస్ మీట్ కొన్ని NGOల తరపున పెట్టాను. ఆ విషయంలో నన్ను ఇష్టమొచ్చినట్టు తిట్టారు. భూతులు కూడా తిట్టారు. పర్సనల్ లైఫ్ కి కూడా వచ్చి తిడుతున్నారు. మాట్లాడలేని పదాలతో తిడుతున్నారు అంటూ ఫైర్ అయింది. దీనిపై ఉపేక్షించేది లేదని సైబర్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పింది.

నెటిజన్ల అసభ్యకర కామెంట్స్

తాజాగా రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్ కి వెళ్లి.. సోషల్ మీడియాలో తన పోస్టుల కింద అసభ్యకర కామెంట్స్ పెడుతున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పదజాలాలు వాడారు అని, అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.

రేణు దేశాయ్ ఫిర్యాదుతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.