|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Retro Collection: టాక్ తేడా కొట్టినా.. వసూళ్లు మాత్రం 100 దాటేశాయ్

Published: 06-05-2025, 10:32 AM

సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా తెలుగులో మిశ్రమ స్పందనను పొందింది. అయినప్పటికీ, తమిళనాడులో మంచి వసూళ్లను సాధించి, 100 కోట్ల మార్కును దాటింది. తెలుగులో హిట్ అయి ఉంటే వసూళ్లు మరింత పెరిగేవి.

Key Points

1

సూర్య 'రెట్రో' సినిమా 100 కోట్ల క్లబ్‌లో సభ్యత్వం

2

తెలుగులో టాక్ తక్కువగా ఉన్నప్పటికీ, తమిళంలో మంచి వసూళ్లు

3

నాని 'హిట్ 3' కంటే వసూళ్లలో 'రెట్రో' కొద్దిగా వెనుకబడింది

4

సూర్య తదుపరి చిత్రం దీపావళికి విడుదల కావచ్చు

రెట్రో సినిమా వసూళ్లు

సూర్య లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. తెలుగులో రిలీజైన మొదటిరోజు నుంచే ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరోవైపు తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్, వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఎలాగోలా వంద మార్క్ దాటేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

గతేడాది సూర్య నటించిన కంగువ సినిమా రిలీజైంది. దీనిపై సూర్యతో పాటు అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అయింది. దీంతో ‘రెట్రో’తో కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నారు. ‍కానీ ఇది తమిళనాడు వరకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా ఐదు రోజుల తర్వాత రూ.104 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

తెలుగు, తమిళ వసూళ్ల పోలిక

ఎలాగైతేనేం సూర్య మూవీకి రూ.100 కోట్లు వచ్చేశాయి. ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ తెలుగులోనూ హిట్ అయ్యింటే ఈ నంబర్స్ మరింత పెరిగేవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరోవైపు నాని హిట్ 3 చిత్రానికి నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు పోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే సూర్య కంటే నానినే ముందున్నాడు.

సూర్య తదుపరి ప్రాజెక్టులు

ప్రస్తుతం సూర్య.. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు కూడా.

తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా, తమిళంలో మంచి ఆదరణతో సూర్య ‘రెట్రో’ 100 కోట్ల మార్కును దాటింది. ఆయన తదుపరి చిత్రాలు అభిమానుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.