
📌 Key Points
- దండోరా ఈవెంట్‌లో శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
- చిన్మయి, అనసూయ, మంచు మనోజ్ వంటి సినీ ప్రముఖులు శివాజీ వ్యాఖ్యలను ఖండించారు.
- రామ్ గోపాల్ వర్మ ‘నీతులు నీ ఇంట్లో చెప్పుకో’ అంటూ శివాజీని ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
- ఆర్జీవీ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ కాగా, నెటిజన్లు, మహిళలు ఆయనకు మద్దతు తెలిపారు.
నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ కామెంట్లపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘నీతులు ఇంట్లో చెప్పుకో’ అంటూ శివాజీపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివాజీ వ్యాఖ్యలు, రేగిన దుమారం
నటుడు శివాజీ(Shivaji) ‘దండోరా’ మూవీ ఈవెంట్‌లో మహిళ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారి అందరికీ ఆగ్రహం వచ్చేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో శివాజీపై నెగెటివిటీ మొదలైపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలను తప్పబడుతూ చిన్మయి, అనసూయ, మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత రెండు రోజులుగా ఈ టాపిక్‌పై ఎన్నో వార్తలు వైరల్ అవుతూ.. మహిళా నటీమణులకు కోసం వచ్చేలా చేస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)స్పందించారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘నాకు ఆ వ్యక్తి పూర్తి పేరు తెలియదు, అందుకే నేను ఇక్కడ ఇలా వ్యాఖ్యానిస్తున్నాను… హే శివాజీ, నువ్వు ఎవరైనా సరే, నీ ఇంట్లోని మహిళలు నీలాంటి మొరటు, మురికి మనిషిని భరించడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు వారిని నైతికత పేరుతో నియంత్రించుకో. సమాజంలో, సినిమా పరిశ్రమలో లేదా మరెక్కడైనా ఉన్న ఇతర మహిళల విషయాలపై నీ చెత్త అభిప్రాయాలను రుద్దకు’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కరెక్ట్‌గా చెప్పారని కామెంట్లు పెట్టగా.. అమ్మాయిలు ఆయనకు థాంక్యూ చెబుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్
నెటిజన్లు, సినీ ప్రముఖుల స్పందన
మహిళల విషయంలో నీతులు చెప్పేవారికి ఆర్జీవీ లాంటి సమాధానాలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం సినీ పరిశ్రమలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆర్జీవీ స్పందనపై చర్చ కొనసాగుతోంది.


