|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండరు.. హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్

Published: 13-12-2025, 12:48 AM
నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండరు.. హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్
  • రెండేళ్ల తర్వాత షూటింగ్ కి తిరిగి వస్తుండగా రిచా చద్దాకు చేదు అనుభవం.
  • సినీ పరిశ్రమలోని దగ్గరి వాళ్లే తనకు ద్రోహం చేశారని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్.
  • ద్రోహం చేసిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండరని రిచా ఘాటు వ్యాఖ్యలు.
  • వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన నటి.

బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సంచలనం రేపుతోంది. రెండేళ్ల తర్వాత సెట్స్ కి తిరిగి వస్తుండగా దగ్గరివాళ్లే తనకు ద్రోహం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ద్రోహం చేసిన వారు ఎప్పటికీ సంతోషంగా ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రిచా చద్దా భావోద్వేగ పోస్ట్

బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా (Richa Chadha)పలు చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ భామ గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టాక తనను చూసుకోవడం బిజీ అయిపోయిన రిచా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. ఈక్రమంలో..తాజాగా, సెన్సేషనల్ పోస్టుతో వార్తల్లో నిలిచింది. రెండేళ్ల తర్వాత సెట్‌కి వెళ్లగా.. దగ్గరి వాళ్లే తనకు ద్రోహం చేశారంటూ ఇన్‌స్టాగ్రామ్ పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది. తన కూతురితో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ.. తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. ‘‘నేను రెండేళ్ల తర్వాత ఓ సినిమా షూట్‌కి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కానీ నా శరీరం, మనసు అందుకు సిద్ధపడటానికి చాలా సమయమే తీసుకుంది. ఈక్రమంలోనే ఇండస్ట్రీలో అత్యంత దగ్గరి వ్యక్తులు నాకు ద్రోహం చేశారు, వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు.

దగ్గరివాళ్లే ద్రోహం చేశారన్న రిచా

ఎలా అంటే పక్కనవాళ్ల జీవితంలోని ఆనందాన్నంతా లాగేసుకుంటారు. అయితే ఇదంతా కొత్తేమీ కాదు. గురు దత్ 70 ఏళ్ల క్రితమే చెప్పారు. అలాంటి వాళ్లను నేను క్షమించగలను కానీ ఆ విషయాలు ఎప్పటికీ మర్చిపోలేను. పాప పుట్టాక చాలామంది ఏదో ఒక కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని సలహా ఇచ్చారు. నాకంటూ ఒక జీవితం ఉంది. నా లైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని అందరితో చెప్పడం నాకు నచ్చదు. అసలు సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరమే లేదు. దాని వల్ల ఒంటరితనం పోదు. లేదా మనమేదో రిచ్ అని చెప్పడానికి కాదు. నేను షేర్ చేయకపోయినా ఆల్‌రెడీ రిచ్’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా అసలు ఆమెని మోసం చేసింది ఆమె ఎవరా అని చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియా గురించి రిచా అభిప్రాయం

A post shared by Richa Chadha (@therichachadha)

రిచా చద్దా చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమెను మోసం చేసింది ఎవరు అనే దానిపై అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.