
‘కాంతార: చాప్టర్ 1’ విజయంతో జోరు మీదున్న రిషబ్ శెట్టి, తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇది సమష్టి వైఫల్యమని, పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించడం తేలికని, జన సమూహాన్ని నియంత్రించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Key Points
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన 'కాంతార: చాప్టర్ 1' బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.
కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఇది సమష్టి వైఫల్యం కావొచ్చని రిషబ్ అభిప్రాయపడ్డారు.
పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించడం సులభమే కానీ, క్రౌడ్‌ని నియంత్రించడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు.
టీవీకే చీఫ్, నటుడు విజయ్ చేపట్టిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
‘కాంతార చాప్టర్ 1’ సక్సెస్ మీట్‌లో రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన ‘కాంతార: చాప్టర్1’ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ప్రజెంట్ మూవీ టీమ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న రిషబ్ శెట్టి తమిళనాడులోని జరిగిన కరూర్ ఇష్యూపై స్పందించాడు. ‘కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ప్రజలు హీరోలను ఆరాధిస్తారు. తమకు ఇష్టమైన హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు పాలాభిషేకాలు చేస్తారు. ఈ ఘటనపై స్పందించడానికి మాటలు రావడం లేదు.
ఇది ఒకరి వల్ల జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇది సమష్టి వైఫల్యం కావొచ్చు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలు జరగవు. ఇలాంటి ర్యాలీలు ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, ప్రభుత్వాన్ని నిందించడం సులభమే. కానీ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు’ అని తెలిపాడు. కాగా.. కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ చేపట్టిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు.
కరూర్ ఘటనపై రిషబ్ శెట్టి వ్యాఖ్యలు
సమష్టి వైఫల్యంగా పేర్కొన్న స్టార్ హీరో
మొత్తంగా, కరూర్ ఘటనపై రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు చాలా లోతైనవి. కేవలం ఒకరిని నిందించడం కాకుండా, సామూహిక బాధ్యతను గుర్తుచేశాయి. ఈ సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.

