|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రిషికేశ ఈజ్ బ్యాక్ (మిరపకాయ్)

Published: 21-06-2025, 3:41 PM
రిషికేశ ఈజ్ బ్యాక్ (మిరపకాయ్)

సుప్రసిద్ధ నటుడు రవితేజ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మిరపకాయ్’ త్వరలోనే మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రిషికేశ్’ పాత్రలో రవితేజ అద్భుతమైన నటనను మరోసారి ఆస్వాదించే అవకాశం ఇది.

Key Points

1

రవితేజ నటించిన సూపర్ హిట్ చిత్రం 'మిరపకాయ్' రీ-రిలీజ్

2

ఐబీ ఆఫీసర్ రిషికేశ్ పాత్రలో రవితేజ అద్భుతమైన నటన

4

రవితేజ తాజా చిత్రాలు 'అనార్కలి' మరియు 'మాస్ జాతర' విడుదలకు సిద్ధం

మిరపకాయ్ రీ-రిలీజ్ వివరాలు

ఐబీ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) ఆఫీసర్‌ రిషికేశ మళ్లీ థియేటర్స్‌లోకి వస్తున్నాడు. రవితేజ కెరీర్‌లోని వన్నాఫ్‌ ది హిట్‌ ఫిల్మ్‌ ‘మిరపకాయ్‌’. ఈ చిత్రంలో రిచా గంగో పాధ్యాయ, దీక్షా సేథ్‌ హీరోయిన్లుగా  నటించగా, ప్రకాశ్‌రాజ్‌ విలన్‌ పాత్రలో, మరో ఐబీ ఆఫీసర్‌గా బ్రహ్మాజీ నటించారు. రమేష్‌ పుష్పాల నిర్మించిన ఈ సినిమాను జూలై 11న రీ–రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో ఐబీ ఆఫీసర్‌ రిషికేశ పాత్రలో రవితేజ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. రిషికేశ ఓ అండర్‌కవర్‌ ఆపరేషన్‌తో మాఫియా డాన్‌ కిట్టు (ప్రకాశ్‌రాజ్‌) ఆటను ఎలా కట్టించాడన్నదే ఈ సినిమా కథనం.

ఇక రవితేజ హీరోగా నటించిన మరో చిత్రం ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ ఇటీవల రీ–రిలీజైన విషయం గుర్తుండే ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ‘అనార్కలి’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. కిశోర్‌ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. అలాగే రవితేజ నటించిన ఇంకో చిత్రం ‘మాస్‌ జాతర’ ఈ ఏడాది ఆగస్టు 27న విడుదల కానుంది.

రిషికేశ్ పాత్ర ప్రత్యేకత

రవితేజ తదుపరి చిత్రాలు

చివరగా, రవితేజ అభిమానులకు ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ ఒక పండగ. ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో విజయం సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.