|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్! ఓటింగ్ టైంలో నన్ను బ్యాడ్ చేశారు: వైరల్ ఇంటర్వ్యూ!

Published: 18-01-2026, 10:30 PM
రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్! ఓటింగ్ టైంలో నన్ను బ్యాడ్ చేశారు: వైరల్ ఇంటర్వ్యూ!
  • బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి సంచలన వ్యాఖ్యలు: ఓటింగ్ సమయంలో దారుణ అవమానాలు!
  • తెలిసిన వాళ్ళే అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదని ఓట్లు వెయ్యలేదన్న రీతూ ఆవేదన!
  • నెగిటివిటీని లెక్కచేయకుండా 13 వారాలు హౌజ్‌లో నిలబడ్డ రీతూ చౌదరి!
  • ఫైర్ స్టోర్మ్ సమయంలో డీమాన్ పవన్‌తో విడదీయడానికి ప్రయత్నించారని బాధపడ్డ రీతూ!

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆమె తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఓపెన్ గా మాట్లాడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఓటింగ్ సమయంలో అవమానాలు!

ఇటీవల బిగ్‌ బాస్‌ షోతో విశేషమైన గుర్తింపు, పాపులారిటీ సొంతం చేసుకున్న రీతూ చౌదరీకి సంబంధించి ఇటీవల అనేక వివాదాలు వినిపించాయి. బిగ్‌ బాస్‌ షోకి వెళ్లడానికి ముందు ఓ భూ కుంభ కోణంలో ఆమె పేరు వినిపించింది. అది పెద్ద రచ్చ అయ్యింది. బిగ్‌ బాస్‌ షోకి వెళ్లాక మరో వివాదం నడిచింది. యంగ్‌ హీరోతో డేటింగ్‌లో ఉందనే వార్తలొచ్చాయి. ఆ హీరో భార్య అనేక ఆరోపణలు చేసింది. ఇవన్నీ రీతూ చౌదరీపై బయట తీవ్రమైన నెగటివిటీని క్రియేట్‌ చేశాయి.

ఎంత నెగటివిటీ ఉన్నా రీతూ చౌదరీ 13 వారాలు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉంది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా రాణించింది. టాప్‌ 5లోనూ ఉండాల్సిన కంటెస్టెంట్‌. కానీ ముందే హౌజ్‌ని వీడింది. అయితే తాజాగా ఆమె బిగ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ విషయాలను పంచుకుంది. తనకు ఎదురైన సంఘటనలను వెల్లడించింది. ఫైర్ స్టోర్మ్ వచ్చినప్పుడు చాలా లో అయ్యిందట. డీమాన్‌ పవన్‌ని, తనని విడికొట్టేందుకు వాళ్లు ప్రయత్నించిన నేపథ్యంలో చాలా కుంగిపోయిందట. తాను ఏం తప్పు చేశానని బాధపడిందట. అది తట్టుకోలేక ఎలిమినేట్‌ అయితే బాగుండు అనుకుందట.

నెగెటివిటీపై రీతూ రియాక్షన్!

అయితే తనకంటే తన అమ్మ ఎక్కువగా బాధపడిందట. తన గురించి ఇంత నెగటివిటీ వస్తుందని ఆమె ఎమోషనల్‌ అయ్యిందట. తన బిడ్డ హౌజ్‌నుంచి బయటకు రావాలని, అందులో ఉండొద్దు అనుకుందట. అంతేకాదు తెలిసిన వాళ్ల నుంచే చాలా అవమానాలు ఫేస్‌ చేసిందట. ఓటింగ్‌ కోసం తెలిసిన వాళ్లకి, బంధువులకు ఫోన్‌ చేస్తే చాలా మంది లిఫ్ట్ చేయలేదట. కొందరు లిఫ్ట్ చేసి మీ అమ్మాయి క్యారెక్టర్‌ బ్యాడ్‌గా వస్తుంది, మేం సపోర్ట్ చేయమని మొహం మీదే చెప్పారట. ఇలాంటి దారుణమైన పరిస్థితులను అమ్మ ఫేస్‌ చేసిందని చెప్పింది రీతూ చౌదరీ. అయితే ఇలాంటి అవమానాలు ఫేస్‌ చేసినా జనాలు తనని బాగా లవ్‌ చేశారని, స్వతహాగా ఓట్లు వేసి తనని 13 వారాలు ఉండేలా చేశారని, తన నిజాయితీ ఏంటో వాళ్లకి అర్థమయ్యిందని తెలిపింది రీతూ.

ఫ్యామిలీ సపోర్ట్ గురించి రీతూ

తన క్యారెక్టర్‌ బ్యాడ్‌గా చేయడంపై ఆమె స్పందిస్తూ, తానేంటో తనకు తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, అమ్మకి తెలుసు. వాళ్లు ఎవరో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కావాలని బ్యాడ్‌ చేయాలనుకుంటే కర్మ తిరిగి కొడుతుంది. అదే తాను నమ్ముతానని, అందుకే సైలెంట్‌గా ఉన్నట్టు చెప్పింది రీతూ చౌదరీ. ఒకడు ఇదే కరెక్ట్ అని తాను నమ్మితే, నేను వచ్చి ఏం చెప్పినా నమ్మడు, తనదే రైట్ అనుకుంటాడు. అలాంటి వాడి కోసం నేను బయటకు వచ్చి మాట్లాడటం ఎందుకు అని వెల్లడించింది రీతూ. అంతేకాదు నాన్న చనిపోయాక అంత దూరమయ్యారని, చుట్టాలు ఎవరూ లేరని, తనకు ఎవరూ ఫోన్‌ చేయరని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది రీతూ చౌదరీ. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

రీతూ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.