|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీకాంత్‌పై రితికా సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published: 27-09-2025, 11:14 PM

రియల్ బాక్సర్ నుండి రీల్ హీరోయిన్‌గా మారిన రితికా సింగ్, ఇటీవల రజనీకాంత్‌తో కలిసి ‘వేట్టయాన్’ సినిమాలో నటించింది. ఒక ఇంటర్వ్యూలో రజనీకాంత్ మానవత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలపై హింస పట్ల తన అభిప్రాయాలను కూడా పంచుకుంది.

Key Points

1

నిజ జీవితంలో బాక్సర్‌గా అదరగొట్టిన రితికా సింగ్, 'ఇరుదుచుట్ర' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది.

2

ఇటీవల 'వేట్టయాన్' చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

4

మహిళలపై అత్యాచారాలు జరిగితే తనలో కోపం కట్టలు తెంచుకుంటుందని, వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఆకాంక్షించింది.

రియల్ బాక్సర్ నుండి రీల్ హీరోయిన్‌గా రితికా సింగ్

కొందరు కథానాయికలు సినిమాల్లో బాక్సింగ్ ‌ లో దుమ్ము రేపి ఉండవచ్చు . అయితే నిజ జీవితంలోనే బాక్సింగ్ ‌ లో అదరగొట్టిన నటి రితికాసింగ్ ‌. అవునుఉ రియల్ ‌ బాక్సర్ ‌ గా బరిలో రఫ్పాడించి విన్నర్ ‌ గానిలిచిన ఈ బ్యాఊటీ ఇరుదుచుట్ర చిత్రంతో రీల్ ‌ హీరోయిన్ ‌ గా ఎంట్రీ ఇచ్చారు . ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోనూ రీమేక్ ‌ అయ్యి ఇక్కడి ప్రేక్షకులకు రితికా సింగ్ ‌ ను పరిచయం చేసింది . ఆ తర్వాత ఈ ఉత్తారణి జాణ వరుసగా తమిళం , తెలుగు , మలయాళం , హిందీ భాషల్లో చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు . ఇటీవల వేట్టయాన్ ‌ చిత్రంలో రజనీకాంత్ ‌ తో కలిసి పోలీస్ ‌ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు .

రజనీకాంత్ మానవత్వంపై రితికా ప్రశంసలు

ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో ఒక్కో నటుడు ఒక్కో విధంగా మానవత్వంతో ప్రశాశిస్తున్నవారేనన్నారు . అలాంటి వారితో నటించిన తరుణాలు తన మనసులో ఎప్పటికీ పదిలమేనన్నారు . అలాంటి వారిలో ఒక్కరిని ఎంపిక చేయాలంటే అది రజనీకాంత్ ‌ నే అన్నారు . ఆయన ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా .. ఇతరులపై చూపించే ప్రేమాభిమానాలు ఎపప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు .

మహిళలపై హింస – రితికా సింగ్ స్పందన

మహిళలపై అత్యాచారాలంటేనే తనలో కోపం కట్టలు తెంచుకుంటుదన్నారు . మిమ్మల్ని ఎవరైనా సై ట్ ‌ కొడితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు కొంచెం పక్కకు రమ్మంటానని , ధైర్యం ఉంటే అలాంటోడిని రమ్మనండి చూద్దాం అని సవాల్ ‌ చేశారు . వైవిధ్యమైన కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు రితికాసింగ్ ‌ తెలిపారు .

రితికా సింగ్ వ్యాఖ్యలు రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని, సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతను తెలియజేస్తున్నాయి. బాక్సర్‌గా, నటిగా ఆమె భవిష్యత్ ప్రయాణం, విభిన్న పాత్రల ఆకాంక్ష ఆమె వృత్తి పట్ల అంకితభావాన్ని స్పష్టం చేస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.