
మాస్ మహారాజ్ రవితేజ తన 76వ చిత్రం RT-76 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది.
Key Points
మాస్ మహారాజ్ రవితేజ 76వ సినిమా RT-76 షూటింగ్ జోరుగా సాగుతోంది.
కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
సుధాకర్ నిర్మాణంలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌లో ఈ చిత్రం విడుదలవుతోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అభిమానులను ఉత్సాహపరిచింది.
RT-76 సినిమా విడుదల తేదీ ఖరారు
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన సొంత కష్టంతో అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోగా మారారు. ఇక అతనికి, ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అయితే మన మాస్‌మహారాజ్ నెలకు లేదా రెండు నెలలకు ఓ కొత్త మూవీతో వచ్చి ఆడియన్స్‌ను మెప్పిస్తుంటాడు. ప్రస్తుతం ‘మాస్ జాతర’(Mass Jathara) సినిమాలో నటిస్తున్న రవితేజ.. ఈ మూవీ రిలీజ్ కాకుండానే మరో సరికొత్త మూవీను అనౌన్స్ చేశారు.
రవితేజ కెరియర్లో ఇప్పటివరకు 75 సినిమాలు చేయగా ఇప్పుడు 76వ సినిమాకు.. రంగం సిద్ధం చేశారు. RT-76 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్(Kishore) దర్శకత్వం వహిస్తుండగా… సుధాకర్(sudhakar) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రం వస్తోంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే కాకుండా… రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేశారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. దీంతో రవితేజ.. అభిమానులు… ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.
రవితేజ కెరీర్ లో 76వ చిత్రం
అభిమానులను ఉత్సాహపరిచిన ఫస్ట్ లుక్
చివరగా, రవితేజ అభిమానులకు సంక్రాంతి పండుగకు RT-76 సినిమా ఒక గొప్ప వినోదం అందించనుంది. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.


