|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమ్మవారికి కట్టిన చీరలను కట్టుకోవచ్చా, ఏ నియమాలను పాటించాలి? ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఏం చెయ్యాలో కూడా తెలుసుకోండి!

Published: 03-10-2025, 4:17 AM

అమ్మవారికి సమర్పించిన చీరలను శేష వస్త్రములుగా భావించి కట్టుకోవచ్చా? కట్టుకుంటే ఏ నియమాలు పాటించాలి? అలాగే ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చే నిమ్మకాయలను ఏం చేయాలి? ఈ వివరాలన్నీ ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Key Points

1

అమ్మవారికి సమర్పించిన చీరలను 'శేష వస్త్రములు' అంటారు, వాటిని భక్తితో ధరించవచ్చు.

2

శేష వస్త్రాలు కట్టుకునే ముందు స్నానం చేసి, శుచిగా ఉండాలి; చెడు పనులు చేయకూడదు.

4

ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు, దోషం ఉండదు.

అమ్మవారికి సమర్పించిన శేష వస్త్రాలు

అమ్మవారిని తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి నవరాత్రులను అందరూ చక్కగా జరుపుకొని ఉంటారు. అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది వారి ఇంటికి అమ్మవారికి కట్టిన చీరలను తెచ్చుకుంటూ ఉంటారు. చాలా చోట్ల అమ్మవారికి కట్టిన చీరలను వేలం పాటలో కూడా వేస్తారు. అలాంటి చీరలు కూడా చాలా మంది వేలం పాటలో కొనుగోలు చేసి ఉంటారు. అయితే అమ్మవారికి కట్టిన చీరలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమంది మొక్కుల కింద అమ్మవారికి లేదా స్వామివారికి చీరలను ఇస్తూ ఉంటారు. అయితే, ఆ విగ్రహాలకు కట్టి ఇచ్చిన చీరలు ఏం చేయాలి? ఆ చీరలను ఇంటికి తెచ్చుకోవచ్చా? వాటిని వాడుకోవచ్చా?

ఇలా అమ్మవారికి కట్టిన చీరలు లేదా అమ్మవారి ఎదుట పెట్టిన చీరలను శేష వస్త్రములు అని అంటారు. ఎలా అయితే అమ్మవారికి సమర్పించిన పూలను తలలో పెట్టుకుంటామో, కుంకుమ ను పెట్టుకుంటామో అలాగే అమ్మవారికి సమర్పించిన చీరలు, జాకెట్టు ముక్కలను కట్టుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ఈ చీరలను కట్టుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు. అవేంటో కూడా తెలుసుకుందాం.

శేష వస్త్రాలు ధరించే నియమాలు

అమ్మవారికి పెట్టిన చీరలను కట్టుకున్నప్పుడు చెడ్డ పనులు చేయకూడదు. చాలా మంది ఇలాంటి చీరలను పూజలు వంటి వాటిని జరిపినప్పుడు కట్టుకుంటూ ఉంటారు, మడి చీరగా వాడుతూ ఉంటారు. ఈ చీరలను నెలసరి సమయంలో ఆడవాళ్లు కట్టుకోకుండా చూసుకోవాలి. అదే విధంగా స్నానం చేయకుండా కట్టుకోవడం వంటివి చేయకూడదు.

స్నానం చేసినప్పుడు, శుచిగా ఉన్నప్పుడు ఈ శేష వస్త్రాలను కట్టుకోవడం వలన ఎలాంటి తప్పు లేదు. అమ్మవారి చీర ఇచ్చినప్పుడు కచ్చితంగా కట్టుకోవాలి. మీకు నచ్చని రంగు వచ్చినా సరే కచ్చితంగా కట్టుకుని తీరాలి. అలా చేయనట్లయితే అమ్మవారి ప్రసాదాన్ని తిరస్కరించినట్లు అవుతుంది.

ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయల ఉపయోగం

ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకోవచ్చా? ఇంటికి తెచ్చి ఏం చెయ్యాలి?

ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను తెచ్చి ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలలో ఆ రసం వేసుకుని వాడుకోవచ్చు. దాని వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నిమ్మకాయను ఏదైనా మంత్రం చెప్పి ఇచ్చినట్లయితే దానిని దేవుడి దగ్గర పెట్టుకోవడం లేదా గుమ్మానికి కట్టుకోవడం లాంటివి చేయాలి. కానీ ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను మాత్రం వంటల్లో నచ్చిన విధంగా వాడుకోవచ్చు. కొబ్బరికాయను ఎలా అయితే ఇంటికి తెచ్చి వంటల్లో వాడతామో, అదేవిధంగా నిమ్మకాయలను కూడా వాడుకోవచ్చు. అందులో తప్పు లేదు.

పవిత్రమైన శేష వస్త్రాలను ధరించేటప్పుడు శుచిగా ఉండటం, సరైన నియమాలు పాటించడం ముఖ్యం. అలాగే ఆలయంలో లభించే నిమ్మకాయ ప్రసాదాన్ని వంటల్లో వాడుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.