|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టేజిపై సాయికుమార్ ఆగ్రహం: యువ హీరో ఆదికి పబ్లిక్ వార్నింగ్.. కారణం ఇదే!

Published: 22-12-2025, 6:04 AM
స్టేజిపై సాయికుమార్ ఆగ్రహం: యువ హీరో ఆదికి పబ్లిక్ వార్నింగ్.. కారణం ఇదే!
  • శంబాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయికుమార్ యువ హీరో ఆది సాయికుమార్‌కు వార్నింగ్ ఇచ్చారు.
  • ఫోన్ చూస్తున్నందుకు ఆదిపై స్టేజ్ పైనే సాయికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • డిసెంబర్ 25న విడుదల కానున్న శంబాల సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది.
  • ఈ ఘటన వీడియో వైరల్ అవ్వగా, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

టాలీవుడ్‌లో సాయికుమార్, యువ హీరో ఆది సాయికుమార్ మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శంబాల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజిపై ఆది ఫోన్ చూస్తుండగా సాయికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పబ్లిక్ వార్నింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాయికుమార్ ఆగ్రహానికి అసలు కారణం ఏంటి?

టాలీవుడ్ కుర్ర హీరో ఆదికి సాయికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చూడడం ఏంటని స్టేజ్ పైనే తన ఆదిని కడిగేశారు. హీరో ఆది చేస్తున్న లేటెస్ట్ మూవీ శంబాల. ఈ సినిమాను యుగంధర్ మునీ చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. మహీధర్ రెడ్డి, అన్నాభీమోజు ఇద్దరు ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హీరో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్ గా మెరుస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

శంబాల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

తాజాగా ట్రైలర్ కూడా వదిలింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ అత్యంత భయంకరంగా సీన్స్ ఉన్నాయి. అంతేకాకుండా చాలా ఇంట్రెస్ట్ గా కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ కుర్ర హీరోలు అందరూ వచ్చారు. అయితే కే ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరంను ఉద్దేశించి పొగుడుతూ సాయికుమార్ మాట్లాడారు.

ఆది సాయికుమార్ స్పందన, నెటిజన్ల రియాక్షన్

హీరో ఆది అలాగే కిరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని, పొగుడుతున్న సందర్భంగా తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించాడు హీరో ఆది. మొబైల్లో రీల్స్ చూస్తూ స్టేజ్ పైనే సాయికుమార్ కు కోపం తెప్పించాడు ఆది. ఇది చూసిన సాయికుమార్ వెంటనే ఆగ్రహానికి గురై, ఆది ఏం చేస్తున్నావ్ ? అని గట్టిగా అరిచాడు. దీంతో వెంటనే అలెర్ట్ అయ్యాడు ఆది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. క్లిక్

ఈ సంఘటన టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. పబ్లిక్ ఈవెంట్లలో స్టార్స్ ప్రవర్తనపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. ఆది తన పొరపాటును గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.