|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి పల్లవి: ‘రామాయణ’ కంటే ముందే బాలీవుడ్ ఎంట్రీ

Published: 12-09-2025, 12:16 PM

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సాయి పల్లవి, త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఆమె మొదటి బాలీవుడ్ చిత్రం ‘మేరే రహో’ డిసెంబర్ 12న విడుదల కానుంది. జునైద్ ఖాన్ సరసన నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Key Points

1

సాయి పల్లవి త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

2

ఆమె మొదటి బాలీవుడ్ సినిమా జునైద్ ఖాన్ తో కలిసి.

3

‘మేరే రహో’ అనే సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది.

4

‘రామాయణం’ కంటే ముందుగానే ఈ సినిమా విడుదల కానుంది.

సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం

Sai Pallavi : సాయి పల్లవి సౌత్ లో మంచి మంచి సినిమాలు చేస్తూ బోలెడంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సాయి పల్లవి ఇటీవల తండేల్ సినిమాతో భారీ విజయం అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన సాయి పల్లవి రామాయణ సినిమాలో సీత గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా 2026 దీపావళికి రిలీజ్ కానుంది.(Sai Pallavi)

అయితే రామాయణ సినిమా కంటే ముందే సాయి పల్లవి మరో సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి సాయి పల్లవి ఒక సినిమా చేస్తుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నట్టు సమాచారం. గతంలో ఈ సినిమా టైటిల్ ‘ఏక్ దిన్’ అని, సినిమాని నవంబర్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ మారాయి.

జునైద్ ఖాన్ తో కలిసి సినిమా

‘మేరే రహో’ విడుదల తేదీ

సాయి పల్లవి బాలీవుడ్ ఫస్ట్ సినిమా కొత్త టైటిల్ ‘మేరే రహో’ అని సమాచారం. ఆ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. మరి సాయి పల్లవి బాలీవుడ్ లో మొదటి సినిమాతో అక్కడి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇక ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇప్పటికే లవ్ యాపా, మహారాజ సినిమాలతో హీరోగా పర్వాలేదనిపించాడు.

చివరగా, సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ‘మేరే రహో’ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.