
సాయి రాజేష్ తనతో పనిచేసిన వారు మళ్ళీ ఎందుకు చేయరో సంచలన నిజం బయటపెట్టారు. తన డైరెక్షన్ పద్ధతి, కథలను ఇతరులకు ఇవ్వడం వెనుక గల కారణాలను, అలాగే ఇండస్ట్రీలో తన కెరీర్ ప్లానింగ్ గురించి వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Key Points
సాయి రాజేష్ తనతో పనిచేసిన వారు మళ్ళీ ఎందుకు చేయరో వివరించారు.
తన డైరెక్షన్ లో సినిమా అంటే పూర్తి అంకితభావం, టార్చర్ లా ఉంటుందని వెల్లడించారు.
ఎక్కువ మందికి కథలు చేరాలనే ఉద్దేశంతో వేరే దర్శకులకు ఇస్తానని తెలిపారు.
ఇండస్ట్రీలో స్థిరత్వం కోసం దర్శకుడిగానే కాకుండా రచయిత, నిర్మాతగానూ ఉంటానని చెప్పారు.
సాయి రాజేష్ షాకింగ్ రివీల్
Sai Rajesh: సాయి రాజేష్ నీలం ..ఈ పేరు చెబితే టక్కున గుర్తుపట్టలేకపోవచ్చు కాని, హృదయకాలేయం సినిమా డైరెక్టర్ అనగానే గుర్తుపట్టేవారే ఎక్కువ.ఇక ఆ తర్వాత కొబ్బరి మట్టకి,కలర్ ఫోటోకి కథలు అందించిన ఈ డైరెక్టర్ తీసిన సెకండ్ సినిమా బేబీ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు.ఇక తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ కి కథ అందించడం,అది కాస్తా సూపర్ హిట్ అవడంతో మరోసారి ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
వేరే వాళ్లకి ఇవ్వడం వెనుక సీక్రెట్ ఏంటి ?
తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి రాజేష్ ని అసలు మీరు అంత ఇష్టంగా రాసుకున్న కథలని వేరే వాళ్లకి ఇవ్వడం వెనుక సీక్రెట్ ఏంటి ?అసలు ఆ కథలని మీరే దర్శకత్వం చేయొచ్చు కదా అన్న మాటలకి రియాక్ట్ అవుతూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.తాను డైరెక్షన్ చేస్తే చాలా దగ్గరి వాళ్ళతో, తనకు సింక్ అయిన skn లాంటి వాళ్ళతోనే సినిమాలు చేస్తానని,ఇక ఆ సినిమా కోసం తన బ్లడ్ అండ్ స్వెట్ పెడతానని,అలా పూర్తిగా ఆ సినిమాలో మునిగిపోతానని అందువల్ల తనతో టార్చర్ లా ఫీల్ అయి ఒకసారి చేసిన వాళ్ళెవరు మళ్ళీ తనతో సినిమాలు రిపీట్ చేయరని, తనని ఒక రకంగా డిప్లమాటిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చేమోఅని అసలు విషయం చెప్పుకొచ్చాడు.
కథలు ఇతరులకు ఇవ్వడం వెనుక రహస్యం
ఎప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో
ఇక తనకి కథలు రాయడమంటే ఇష్టమని, అందుకే అన్ని కథలు ఒకడినే చేయకుండా ఎక్కువ కథలని,ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఇతర దర్శకులని ఆ ప్రాజెక్ట్ లలో భాగం చేస్తుంటానని తెలిపాడు.అదే విధంగా ఇక్కడ కేవలం ఒక దర్శకత్వం మీదే ఉంటె ఏం జరుగుతుందో బాగా తెలుసని, ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదని, ఇవ్వాల ఉన్న స్టార్ డమ్ రేపు ఉండదని, అందుకే కేవలం దర్శకుడిగానే కాకుండా ఇలా మిగతా సినిమాల్ని కూడా ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ రైటర్ గా పట్టాలెక్కిస్తానని అసలు విషయం చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలో సాయి రాజేష్ కెరీర్ ప్లానింగ్
‘కలర్ ఫోటో’ సినిమాకు నేషనల్ అవార్డ్
ఇక సాయి రాజేష్ నీలం విషయానికి వస్తే 2014లో మొదటి సారిగా ‘హృదయ కాలేయం’ని స్టీవెన్ శంకర్ పేరుతో తొలిసారి దర్శకత్వం వహించాడు సాయి రాజేష్ ,ఇక ఆ తరువాత రచయితగా 2019లో సంపూర్ణేష్ బాబు హీరోగా ‘కొబ్బరి మట్ట’ సినిమాను నిర్మించిన సాయి రాజేష్ కి 2020లో తను రచయిత,నిర్మాతగా చేసిన ‘కలర్ ఫోటో’ సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకోవడం విశేషం.ఇక తాజాగా కథ అందించిన చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుండటంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు సాయి రాజేష్ !
సాయి రాజేష్ తన వృత్తి పట్ల నిబద్ధతను, ఇండస్ట్రీలో స్థిరత్వం కోసం తన వ్యూహాలను ఈ విధంగా పంచుకున్నారు. ఆయన నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


