|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha Ruth Prabhu: ఆ స్పెషల్‌ టాటూ ఇంకా పదిలంగానే..

Published: 26-07-2025, 11:10 AM

సమంత రూత్ ప్రభు ‘ఏ మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాకు గుర్తుగా ఆమె మెడపై టాటూ వేయించుకుంది. కానీ విడాకుల తర్వాత ఆ టాటూ తొలగించుకుందని అనుకున్నారు.

Key Points

1

సమంత 'ఏ మాయ చేసావే' చిత్రానికి గుర్తుగా టాటూ వేయించుకుంది.

2

విడాకుల తర్వాత ఆ టాటూ తొలగించుకుందని అనుకున్నారు.

4

సమంత ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్' వెబ్ సిరీస్ మరియు 'మా ఇంటి బంగారం' సినిమాలో నటిస్తోంది.

ఏ మాయ చేసావే టాటూ

హీరోయిన్‌గా సమంత ( Samantha Ruth Prabhu ) వెండితెరకు పరిచయమైన చిత్రం ఏమాయ చేసావె ( Ye Maaya Chesave Movie ). నాగచైతన్య హీరోగా నటించాడు. 2010లో వచ్చిన ఈ ప్రేమకథాచిత్రంతోనే వీరి లవ్‌కు పునాది పడింది. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్‌ కావడంతో సామ్‌కు బోలెడంత గుర్తింపు వచ్చింది. అందుకే ఈ స్పెషల్‌ చిత్రానికి గుర్తుగా సామ్‌.. YMC (ఏ మాయ చేసావే) టాటూను మెడపై వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తనకెంతో స్పెషల్‌ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.

పచ్చబొట్టు మాయం? ఇదే కాదు. చై ప్రేమకు గుర్తుగా కూడా ఓ పచ్చబొట్టు వేయించుకుంది. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఆ టూటూ తొలగించుకుంది. ఇటీవల ఓ వీడియో YMC పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఆ గుర్తును కూడా పూర్తిగా చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా సామ్‌ పోస్ట్‌ చేసిన ఫోటోల్లో ఆ పేరు అలాగే చెక్కుచెదరకుండా ఉంది.

విడాకుల తర్వాత టాటూ

విడాకులు నాగచైతన్య-సమంత 2017లో పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా ఉండే ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. చై.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్‌ కూడా.. దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే.. సమంత చివరగా శుభం చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతోనే తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌ వెబ్‌సిరీస్‌తో పాటు మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది.

తాజా ఫోటోల్లో టాటూ

సమంత తన ‘ఏ మాయ చేసావే’ టాటూను ఇంకా తొలగించుకోలేదు. ఈ టాటూ ఆమెకు ప్రత్యేకమైన జ్ఞాపకంగా ఉండిపోయింది అనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.