
టాలీవుడ్‌లో సమంత పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. రాజ్ నిడిమోరుతో ఆమె కనిపించడం, లండన్‌లో వారి ఫోటోలు వైరల్ కావడం, తాజాగా సమంత చేతికి ఉన్న ఉంగరం.. ఇవన్నీ ఆమె గురించి చర్చను రేకెత్తిస్తున్నాయి.
Key Points
సమంత చేతికి కనిపించిన ప్రత్యేకమైన ఉంగరం నెటిజన్లలో చర్చకు దారితీసింది.
సమంత మరియు రాజ్ నిడిమోరు కలిసి కనిపించడం వల్ల డేటింగ్ రూమర్స్ మళ్ళీ వైరల్ అయ్యాయి.
ఇద్దరు లండన్‌లో కలిసి సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
త్వరలోనే సమంత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుందని చర్చలు జరుగుతున్నాయి.
సమంత చేతిలో ఉంగరం
టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల ఎక్కువగా మార్మోగిపోతోంది. ఎక్కడికెళ్లినా ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది . ఇద్దరు కలిసి డిన్నర్ తర్వాత ఓకే కారులో వెళ్లడంతో ఈ జంట డేటింగ్ పై మరోసారి మొదలైంది . కొద్ది రోజుల క్రితమే లండన్ వీధుల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు . దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి .
రాజ్ నిడిమోరుతో సమంత
అయితే తాజాగా ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫోటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది . రెస్టారెంట్ లో చిల్ అవుతూ కనిపించింది . ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం మరో చర్చకు దారితీసింది . ఇంతకుముందు ఎప్పుడు కనిపించని ప్రత్యేకమైన రింగ్ సామ్ చేతికి ఉండడంతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారా ? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో మరోసారి సామ్ ఎపిసోడ్ టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది . మరోవైపు త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుందా అనే చర్చ మొదలైంది.
డేటింగ్ రూమర్స్
కాగా .. సమంత .. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో నటించారు . రాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్ – 2, సిటాడెల్: హనీ బన్నీలోసామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్‌ల సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు . అయితే తమపై వస్తున్న రూమర్స్ పై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు .
సమంత మరియు రాజ్ నిడిమోరు ఏ విధంగానూ స్పందించకపోవడంతో ఈ రూమర్స్‌కు అసలు నిజం తెలియాలంటే వారి స్పందన కోసం ఎదురుచూడాలి. త్వరలోనే వారు ఏదైనా ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.


