
📌 Key Points
- సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ మే 15న గ్రాండ్ రిలీజ్!
- నెటిజన్ల ట్రోల్స్‌పై సమంత స్ట్రాంగ్ కౌంటర్: బ్లాక్ చేస్తానంటూ హెచ్చరిక!
- నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’ తర్వాత మరో హిట్ కొట్టేందుకు సామ్ రెడీ!
- రాజ్ & డీకే దర్శకత్వంలో సమంత ‘రక్త బ్రహ్మాండం’ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది!
టాలీవుడ్ స్టార్ సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు తన సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం!
ట్రోల్స్‌పై సమంత సీరియస్ రియాక్షన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) చాలా రోజుల తర్వాత యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (maa inti bangaram)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 15న థియేటర్స్‌లోకి రాబోతుంది. సామ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో.. తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ.. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నెగటివ్ కామెంట్లను ఎలా ఎదుర్కొంటారని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. ‘‘ప్రశంసలు నన్ను పొంగిపోయేలా చేయవు, అలాగని ట్రోల్స్ నన్ను కుంగదీయవు. కానీ నా డిజిటల్ స్పేస్‌లోకి ఎవరైనా నెగిటివిటీని తీసుకొస్తే మాత్రం బాగోదు వారిని వెంటనే బ్లాక్ చేస్తాను.
‘మా ఇంటి బంగారం’ రిలీజ్ ఎప్పుడంటే?
నా ఇంటిని నేను ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటానో, నా సోషల్ మీడియా పేజీని కూడా అలాగే ఉంచుకుంటాను. నేను మిమ్మల్ని బ్లాక్ చేశానంటే మీరు నన్ను బాధపెట్టారని కాదు, నా ప్రపంచంలోకి మీకు ప్రవేశం లేదని అర్థం’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ సమయం వృధా చేయడం గురించి స్పందిస్తూ.. ఇది తనను కూడా భయపెడుతోందని ఆమె అంగీకరించారు. చిన్నప్పుడు చదువుకోవడానికి ఒక టైమ్‌టేబుల్ ఉండేదని, ఇప్పుడు ఆ ఏకాగ్రతను కోల్పోతున్నామేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. రీల్స్ సృష్టించే ‘ఫోమో’ నుండి బయటపడటానికి తాను పుస్తకాలు చదవడం, పాడ్‌కాస్ట్‌లు వినడం మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వంటి నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఓ నెటిజన్ ఓ ఫన్నీ థింగ్ చెప్పమని అడగ్గా.. కిందపడి మరి నవ్వుతానంది.
వెబ్ సిరీస్‌లో సమంత అదరగొట్టే పర్ఫామెన్స్!
ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అనడంతో ధ్యానం చేస్తానని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. సమంత సినిమాల విషయానికొస్తే.. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వురు దీనిని ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటుగా సామ్ రాజ్ & డీకే దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ సామ్ మళ్లీ బిజీ అయిపోతుంది.
సమంత సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు వేచి ఉండండి!


