|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sambhavna Seth: డాక్టర్ నిర్లక్ష‍్యం వల్లే గర్భస్రావం.. 15 రోజుల ముందే: సంభావన సేత్

Published: 15-07-2025, 9:22 AM

ప్రముఖ బిగ్ బాస్ నటి సంభావన సేత్ తన గర్భస్రావ అనుభవాన్ని పంచుకుంది. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన ఆమెకు 15 రోజుల ముందే బిడ్డ హృదయస్పందన ఆగిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆమె ఆరోపించింది.

Key Points

1

సంభావన సేత్ గతేడాది డిసెంబర్‌లో గర్భస్రావం అయింది.

2

డాక్టర్ నిర్లక్ష్యం వల్లే గర్భస్రావం జరిగిందని ఆమె ఆరోపించింది.

4

వైద్యుడు తగిన పరీక్షలు చేయకుండా అన్ని సరిగ్గా ఉన్నాయని చెప్పాడని ఆమె పేర్కొంది.

సంభావన సేత్ గర్భస్రావ అనుభవం

ప్రముఖ బిగ్ ‌ బాస్ ‌ బ్యూటీ , బుల్లితెర నటి సంభావన సేత్ ‌ బాలీవుడ్ ‌ లో పలు సీరియల్స్ ‌ లో నటించింది . సీరియల్స్ ‌ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది . 2016 లో అవినాశ్ ద్వివేదిని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ .. తాజాగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది . గతేడాది ఐవీఎఫ్ ‌ ద్వారా గర్భం దాల్చగా .. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటనను వివరించింది .

డాక్టర్ నిర్లక్ష్యంపై ఆరోపణలు

గతేడాది డిసెంబర్‌లో జరిగిన తనకు గర్భస్రావమైందని సంభావన సేత్‌ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో అంతా బాగానే ఉందని వైద్యుడు మాకు హామీ ఇస్తూనే ఉన్నాడని తెలిపింది . కానీ ఆ తర్వాత గర్భంలో తన బిడ్డ హృదయ స్పందన 15 రోజుల ముందే ఆగిపోయిందని తాను గుర్తించానని వెల్లడించింది. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా నిర్వహించామని సంభావన పేర్కొంది . ఈ సంతోషకర విషయాన్ని చెప్పేందుకు ఒక రోజు ముందే తనకు బ్లీడింగ్ మొదలైందని షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది .

15 రోజుల ముందు హృదయస్పందన ఆగిపోవడం

అయితే దాదాపు 15 రోజుల ముందే అనారోగ్యంతో ఉన్నానని వైద్యుడికి సమాచారం ఇచ్చా .. కానీ నాకు ఆర్థరైటిస్ సమస్య అని తేలిగ్గా తీసుకున్నారు . ఆ తర్వాత ఆర్థరైటిస్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్లగా అలాంటిదేం లేదని చెప్పారు .. ఇది గర్భస్రావానికి సంకేతమని డాక్టర్ అన్నారు . కానీ మేము సంప్రదించిన డాక్టర్ ‌ మాత్రం ఎలాంటి టెస్టులు చేయకుండా అంతా నార్మల్ ‌ గానే ఉందని చెప్పారని గుర్తు చేసుకుంది . డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తనకు గర్భస్రావం అయిందని తెలుసొచ్చిందని సంభావన వివరించింది . అంతేకాకుండా మీకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ తనదే తప్పు అన్నట్లుగా మాట్లాడిందని తన బాధను వ్యక్తం చేసింది

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతటి విషాదం సంభవిస్తుందో సంభావన సేత్ అనుభవం చాటుతోంది. తగిన వైద్య సహకారం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి తెలియజేస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.