
📌 Key Points
- Samsung Galaxy A37 5G, A57 5G ఫోన్లు త్వరలో విడుదల కానున్నాయి.
- A37 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
- Samsung Galaxy A37 5G వెనుకవైపు 50MP కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
- ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్‌యూఐ 8.5తో వస్తాయని భావిస్తున్నారు.
శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! శాంసంగ్ గెలాక్సీ A37 5G, A57 5G ఫోన్లు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల యొక్క ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు లీక్ అయ్యాయి.
Samsung Galaxy A37 5G ఫీచర్లు
Samsung Galaxy Phones : శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోన్లు రాబోతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ A37 5G, శాంసంగ్ గెలాక్సీ A57 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లలో ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి శాంసంగ్ నుంచి రెండు ఫోన్లు రాబోతున్నాయి. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్‌లో గెలాక్సీ A37 5G, గెలాక్సీ A57 5G ఫోన్లను లాంచ్ చేయనుంది.
కంపెనీ ఇంకా కొత్త శాంసంగ్ ఫోన్లను వెరిఫై చేయలేదు. అయినప్పటికీ లీక్‌లు పుకార్లు ఆన్‌లైన్‌లో మొదలయ్యాయి. లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్లు 120Hz ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తాయని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ, శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌పై రన్ అయ్యే అవకాశం ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 6GB ర్యామ్, 8GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో అందించవచ్చు.
Samsung Galaxy A57 5G స్పెసిఫికేషన్లు
అదనంగా, మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీ ఎక్స్ ప్యాండ్ ఆప్షన్ ఉండకపోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ వన్‌యూఐ 8.5తో ఆండ్రాయిడ్ 16తో వస్తుందని భావిస్తున్నారు. డిస్‌ప్లే పరంగా శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1080×2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా.
Read Also : Credit Card Sharing : మీ క్రెడిట్ కార్డు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఇస్తున్నారా? మీరు అప్పులపాలవ్వడం ఖాయం.. చాలామంది చేసే తప్పులివే!
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో కెమెరా సెన్సార్ ఉండవచ్చు. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
ధర మరియు విడుదల తేదీ వివరాలు
కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించనుంది.
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ స్పెసిఫికేషన్లు లీక్ : శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌తో పాటు ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు.
కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 12MP ఫ్రంట్ సెన్సార్‌తో వస్తుంది. బ్యాటరీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ A37 5G మరియు A57 5G ఫోన్లు ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్నాయి. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది. ఈ ఫోన్లు మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.


