|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samsung S25 Ultra: అమెజాన్‌లో ఊహించని డిస్కౌంట్! కొనాలా వద్దా? మీ నిర్ణయం మార్చేసే ఆఫర్!

Published: 18-03-2026, 10:05 AM
Samsung S25 Ultra: అమెజాన్‌లో ఊహించని డిస్కౌంట్! కొనాలా వద్దా? మీ నిర్ణయం మార్చేసే ఆఫర్!
  • అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై రూ. 22,249 తగ్గింపు లభిస్తోంది.
  • ICICI బ్యాంక్ కార్డుతో అదనంగా రూ. 1,500 వరకు ఆదా చేసుకోవచ్చు.
  • పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 33,600 వరకు తగ్గింపు పొందవచ్చు.
  • నెలకు రూ. 3,788 ఈఎంఐతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ తగ్గింపు లభిస్తోంది. లక్ష రూపాయల ధరలో ఉన్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ వివరాలు మరియు ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ఎంత?

Samsung Galaxy S25 Ultra : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ భారీగా తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్. లక్ష ధరలో ఆల్-రౌండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ డీల్ మీకోసమే.. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ అయిన దాదాపు నెల తర్వాత భారీ తగ్గింపుతో లభిస్తోంది.

గత ఏడాదిలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, అమెజాన్‌లో రూ. 22,249 భారీ ధర తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ శాంసంగ్ ఫోన్ శాంసంగ్ స్టోర్‌లో దాదాపు ఎలాంటి తగ్గింపు లేకుండా రూ. 1,29,999 ధరకు లభిస్తుంది. మీ ప్రస్తుత ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో అప్‌గ్రేడ్ చేసుకుంటే ఈ అదిరిపోయే డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..

S25 అల్ట్రాపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వివరాలు

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ఎంతంటే? : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ రూ. 1,07,750కి అందుబాటులో ఉంది. అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై సుమారు రూ. 1,500 ఆదా చేసుకోవచ్చు. దాంతో అసలు ధర సుమారు రూ. 1,06,000కు తగ్గుతుంది.

ఈ డీల్‌ కోసం మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రూ. 33,600 వరకు తగ్గింపు పొందవచ్చు. ఫైనల్ వాల్యూ అనేది మీ ఫోన్ పర్ఫార్మెన్స్, మోడల్, వేరియంట్, బిల్లింగ్ తేదీపై ఆధారపడి ఉంటుంది.

Read Also : Yamaha Tricity 300 : వారెవ్వా.. వరల్డ్ ఫస్ట్ ఎయిర్‌బ్యాగ్ స్కూటర్.. యమహా ట్రైసిటీ 300 లుక్, స్టైల్ సూపర్!

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనాలా? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

నెలకు రూ. 3,788 ఈఎంఐతో కూడా శాంసంగ్ అల్ట్రా ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ మీ బ్యాంకు, నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది. అదనంగా చెల్లిస్తే మీరు టోటల్ మొబైల్ ప్రొటెక్షన్ వంటి కొత్త యాడ్-ఆన్‌లను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనాలా? వద్దా? : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ రూ. 1,39,999 ధరకు లాంచ్ అయింది. సుమారు రూ. 1,06,000 ధరలో లభించే S25 అల్ట్రాను కొనేసుకోవచ్చు. 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, 200MP మెయిన్ కెమెరా సెన్సార్, ఎస్ పెన్ వంటి దాదాపు ఒకే రకమైన ఫీచర్లను అందిస్తుంది.

గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ అందిస్తుంది. 5x ఆప్టికల్ జూమ్, OISతో 50MP పెరిస్కోప్ లెన్స్‌, 10MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను అందిస్తుంది. గెలాక్సీ ఏఐ ఫీచర్లతో పాటు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ప్రస్తుతం తక్కువ ధరలో లభిస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే కొనే ముందు మీ అవసరాలకు తగినదా కాదా చూసుకోండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.