
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఒక మాస్టర్‌పీస్, సినిమాటిక్ తుఫాన్ అని అభివర్ణించారు. సందీప్ ట్వీట్‌కు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Key Points
సందీప్ వంగా 'కాంతార చాప్టర్ 1'ను మాస్టర్‌పీస్, సినిమాటిక్ తుఫాన్‌గా అభివర్ణించారు.
భారతీయ సినిమా ఇలాంటిది ఇంతకుముందెన్నడూ చూడలేదని సందీప్ పేర్కొన్నారు.
సందీప్ ట్వీట్‌కు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలుపుతూ, ఎమోజీని పంపారు.
పైరసీని ప్రోత్సహించవద్దని అభిమానులకు రిషబ్ శెట్టి విజ్ఞప్తి చేశారు.
సందీప్ వంగా ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నటుడు రిషబ్ శెట్టి తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ ను ప్రశంసలతో ముంచెత్తాడు. శుక్రవారం (అక్టోబర్ 3) ఎక్స్ వేదికగా సందీప్ ఈ సినిమాను ఓ మాస్టర్‌పీస్ అని అభివర్ణించాడు. “భారతీయ సినిమా ఇంతకుముందు ఇలాంటిదాన్ని ఎప్పుడూ చూడలేదు” అని కూడా అన్నాడు. రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటించడమే కాకుండా, కథను రాసి, దర్శకత్వం కూడా వహించిన విషయం తెలిసిందే.
కాంతార ఛాప్టర్ 1 ఓ సినిమాటిక్ తుఫాన్
రిషబ్ శెట్టి ‘కాంతార ఛాప్టర్ 1’ను ప్రశంసిస్తూ సందీప్ రెడ్డి వంగా శుక్రవారం (అక్టోబర్ 3) తెల్లవారుఝామున ఓ ట్వీట్ చేశాడు. “కాంతార ఛాప్టర్ 1 నిజమైన కళాఖండం. భారతీయ సినిమా ఇంతకుముందు ఇలాంటిదాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ తుఫాను. రా, డివైన్, అన్‌షేకబుల్. రిషబ్ శెట్టి నిజమైన వన్ మ్యాన్ షోను అందించాడు. ఒక్కడే దీనిని రూపొందించి, మోశాడు రిషబ్ శెట్టి. అజనీష్ అందించిన బీజీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాలి” అని సందీప్ అన్నాడు.
రిషబ్ శెట్టి రియాక్షన్
రిషబ్ శెట్టి రియాక్షన్ ఇలా..
సందీప్ రెడ్డి వంగా తన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో అతని ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ రిషబ్ శెట్టి స్పందిస్తూ.. థ్యాంక్యూ బ్రదర్ అనే క్యాప్షన్ తో ఓ రెడ్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ఇక మరొక ట్వీట్‌లో సినిమా విడుదల రోజున దాని పర్ఫార్మెన్స్ పట్ల రిషబ్ ఎమోషనల్ అయ్యాడు. “2016లో ఒక ఈవెనింగ్ షో దొరకడానికి కష్టపడటం నుంచి 2025లో 5000 హౌస్‌ఫుల్ షోల వరకు. ఈ ప్రయాణం మీ ప్రేమ, మద్దతు, దేవుడి దయ తప్ప మరొకటి కాదు. దీనిని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ కృతజ్ఞుడను” అని రిషబ్ ట్వీట్ చేశాడు.
పైరసీని ప్రోత్సహించవద్దని రిషబ్ విజ్ఞప్తి
పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి
రిషబ్ శెట్టి తన అభిమానులను పైరసీని ప్రోత్సహించవద్దని కోరుతూ మరో పోస్ట్‌ను కూడా పంచుకున్నాడు. “ప్రియమైన కాంతార కుటుంబం సినిమా ప్రియులారా.. కాంతార ఛాప్టర్ 1 మాదైనంతగా మీది కూడా.. మీ ప్రేమ దీనిని నిజంగా మరపురానిదిగా చేసింది. దయచేసి మీరు సినిమాలోని వీడియోలను షేర్ చేయవద్దని/రికార్డ్ చేయవద్దని, పైరసీని ప్రోత్సహించవద్దని మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము. ‘కాంతార’ మ్యాజిక్‌ను థియేటర్లలో సజీవంగా ఉంచుదాం. తద్వారా ప్రతి ఒక్కరూ దానిని చూడాలనుకున్న విధంగా అనుభూతి చెందగలరు. బ్లాక్‌బస్టర్ కాంతారను థియేటర్లలో మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయండి” అని రిషబ్ కోరాడు.
‘కాంతార చాప్టర్ 1’ గురించి..
2022లో వచ్చిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఈ కాంతార ఛాప్టర్ 1 వచ్చింది. ఈ సినిమా దసరా సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ తో సహా అనేక భాషల్లో విడుదలైంది. Sacnilk.com ప్రకారం ఈ మూవీ మొదటి రోజునే ఇండియాలో రూ.60 కోట్ల నెట్ వసూలు చేసింది.
‘కాంతార చాప్టర్ 1’పై సందీప్ వంగా ప్రశంసలు ఈ సినిమా క్రేజ్‌ను మరింత పెంచాయి. రిషబ్ శెట్టి పైరసీకి వ్యతిరేకంగా చేసిన విజ్ఞప్తి సినిమాను థియేటర్లలోనే చూడాలనే సందేశాన్ని ఇచ్చింది.


