
📌 Key Points
- సంక్రాంతి 2026కి ప్రభాస్, చిరంజీవి, రవితేజ సహా పలు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల.
- స్టార్ హీరోలంతా తమ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.
- నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ మాత్రం తమ సినిమాల ప్రమోషన్లకు దూరంగా, సైలెంట్‌గా ఉన్నారు.
- ఈ ఇద్దరు హీరోల మౌనంపై అభిమానులు ఆశ్చర్యం, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి 2026కి పలు భారీ బడ్జెట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. స్టార్ హీరోలైన ప్రభాస్, చిరంజీవి, రవితేజ వంటి వారు తమ సినిమాల ప్రమోషన్లలో బిజీగా ఉండగా, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ మాత్రం తమ సినిమాల ప్రచారం విషయంలో మౌనంగా ఉన్నారు. ఇది అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సందడి
Sankranthi 2026 Movies: సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ది రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి , రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఈ సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరోలందరూ వారి సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడని ప్రభాస్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
ఇక చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్లలో కూడా చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా రవితేజ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇలా ఈ హీరోలందరూ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), శర్వానంద్ (Sharwanand) మాత్రం ఇప్పటివరకు తమ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేదు. ఇలా ఈ ఇద్దరి హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుంది.
నవీన్, శర్వానంద్ ప్రమోషన్లపై సైలెన్స్
ఈ నేపథ్యంలోనే హీరోలందరూ కూడా వారి సినిమాల ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ శర్వానంద్, నవీన్ పోలిశెట్టి మాత్రం సైలెంట్ గా ఉండటం గమనార్హం. ఈ రెండు సినిమాల ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్లు , చిత్ర నిర్మాతలు పాల్గొన్నప్పటికీ హీరోలు మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమాల ట్రైలర్ గానీ, ప్రీ రిలీజ్ వేడుకలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వెల్లడించలేదు. దీంతో ఈ సినిమాల విషయంలో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ వివరాలు
అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari)విషయానికి వస్తే శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 15వ తేదీ విడుదల కాగా 14వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్స్ పై ఇప్పటివరకు అధికారక ప్రకటన వెల్లడించలేదు. మరి ఇప్పుడైనా హీరోలు ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాని ముందుకు నడిపిస్తారా? లేదంటే ప్రమోషన్లకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
ఇలా మిగతా హీరోలు ప్రమోషన్లతో హోరెత్తిస్తుండగా, నవీన్, శర్వానంద్ మౌనం వెనుక ఉన్న వ్యూహం ఏంటో చూడాలి. ఈ సినిమాల బాక్సాఫీస్ ప్రయాణం ఎలా ఉండబోతుందో, వారి సైలెన్స్ ఫలితం ఏంటో మరికొన్ని రోజుల్లో తేలనుంది.


