
📌 Key Points
- గత ఏడాది కోలీవుడ్ రూ.2000 కోట్లకు పైగా నష్టపోయింది.
- ఈ సంక్రాంతికి టాలీవుడ్ రూ.1000 కోట్ల కలెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుంది.
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా రూ.300-400 కోట్లు రాబట్టాల్సి ఉంది.
- చిరంజీవి సినిమా రూ.200 కోట్లు, ఇతర చిత్రాలు కలిపి రూ.400 కోట్లు టార్గెట్.
గత ఏడాది కోలీవుడ్ నష్టాల నుండి పాఠాలు నేర్చుకున్న టాలీవుడ్, ఈ సంక్రాంతికి రూ.1000 కోట్ల భారీ టార్గెట్ తో రంగంలోకి దిగుతోంది. ఈ లక్ష్యం చేరుకుంటేనే టాలీవుడ్ సురక్షితం అని భావిస్తున్నారు. అయితే ఈ 1000 కోట్లు సాధించే సత్తా టాలీవుడ్ కు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోలీవుడ్ నష్టాల నుండి టాలీవుడ్ గుణపాఠం
Tollywood:ఈ మధ్యకాలంలో ప్రతి భాషా ఇండస్ట్రీ కూడా జానర్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడమే దిశగా అడుగులు వేస్తూ విభిన్నమైన చిత్రాలతో థియేటర్లలోకి వస్తోంది.. ముఖ్యంగా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాకి గుర్తింపు లభిస్తుంది అనడంలో సందేహం లేదు.. అలా కంటెంట్ బాగలేకనే గత ఏడాది ఏకంగా రూ.2000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది కోలీవుడ్ పరిశ్రమ. ఒక్క కోలీవుడ్ నుంచి ఏకంగా 280 చిత్రాలు విడుదలయితే.. అందులో కేవలం 30 చిత్రాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిగతా సినిమాలు డిజాస్టర్ గా నిలవడం వల్లే కోలీవుడ్ కి ఆ రేంజ్ లో నష్టం వాటిల్లింది. అందుకే ఈ ఏడాది పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న టాలీవుడ్ సినీ పరిశ్రమ భారీ టార్గెట్ తో రంగంలోకి దిగుతోంది.
గత ఏడాది కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలీవుడ్ పరిశ్రమ ముందు 1000కోట్ల టార్గెట్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి 1000 కోట్ల కలెక్షన్స్ రాబడితే టాలీవుడ్ సేఫ్ జోన్ లోకి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ 1,000 కోట్లు సాధించే సత్తా టాలీవుడ్ కి ఉందా? అసలు ఈ 1,000 కోట్లను తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ సినీ పరిశ్రమకు అందిస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ వెయ్యి కోట్ల టార్గెట్: సాధ్యమేనా?
ఇకపోతే ఈ సంక్రాంతి సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) హీరోగా, మారుతీ దర్శకత్వంలో.. ప్రభాస్ కెరియర్ లో తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న చిత్రం ది రాజా సాబ్. జనవరి 9న సంక్రాంతి సందడిని ప్రారంభించబోతోంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్లు, టీజర్, పోస్టర్లు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా ఈ ఒక్క సినిమా సుమారుగా రూ.300 నుండి రూ.400 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.
సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు
ఇటు సంక్రాంతి బరిలోకి దిగుతున్న మరో స్టార్ హీరో మూవీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సుమారుగా 200 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో పాటు మిగతా అన్ని సినిమాలు కలుపుకుంటే సుమారుగా రూ.400 కోట్లు రాబట్టాలి.
మొత్తం రూ.1000 కోట్లు ఇస్తే అందులో షేర్ 500 కోట్లు.. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్క సీజన్లో ఒక్క పండక్కి గ్రాస్ కలెక్షన్స్ 1000 కోట్లను వసూలు చేయగలదా? అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ టార్గెట్ ను ఈ పండక్కి పూర్తి చేయగలిగితేనే టాలీవుడ్ సినీ పరిశ్రమ సేఫ్ జోన్ లోకి వెళుతుంది. లేకపోతే నష్టాలు తప్పవు అనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు సినీ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం టాలీవుడ్ పరిశ్రమ ఈ సంక్రాంతి సీజన్ ను ఏ విధంగా క్యాష్ చేసుకుంటుందో.
మొత్తంగా, ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోల చిత్రాలపైనే టాలీవుడ్ రూ.1000 కోట్ల లక్ష్యం ఆధారపడి ఉంది. ఈ కలెక్షన్లు టాలీవుడ్ భవిష్యత్తుకు కీలకం కానున్నాయి.


