|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సారా అర్జున్ తండ్రి ఎవరో తెలుసా? ఆ స్టార్ నటుడు ఎవరంటే! షాకింగ్ నిజాలు!

Published: 03-04-2026, 7:05 AM
సారా అర్జున్ తండ్రి ఎవరో తెలుసా? ఆ స్టార్ నటుడు ఎవరంటే! షాకింగ్ నిజాలు!
  • సారా అర్జున్ ‘నాన్న’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
  • రాజ్ అర్జున్ 30కి పైగా సినిమాల్లో నటించారు.
  • రాజ్ అర్జున్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో క్రికెట్ సెలెక్టర్ పాత్రలో కనిపించారు.
  • సారా అర్జున్ ధురంధర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

సారా అర్జున్ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్. ఆమె తండ్రి రాజ్ అర్జున్ ఒక తెలుగు స్టార్ నటుడు. ఈయన అనేక తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

సారా అర్జున్ సినీ ప్రస్థానం

Sara Arjun:సారా అర్జున్ (Sara Arjun).. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు , తమిళ్ ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ మూవీ ధురంధర్ సినిమాలో హీరోయిన్ గా కనిపించి.. కుర్రకారు క్రష్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించింది.. అలాగే ధురంధర్ 2 ది రివేంజ్ లో ఏకంగా తల్లి పాత్ర పోషించి అదరహో అనిపించింది. ఇందులో హీరో రణవీర్ సింగ్ భార్య యలీనా జమాలీ పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయింది. ఇక దీంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

విక్రమ్ హీరోగా నటించిన ‘నాన్న’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్.. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్ర పోషించి ఆకట్టుకుంది. గత ఏడాది ఆదిత్యధర్ , రణవీర్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ధురంధర్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈమె.. దీని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యుఫోరియా సినిమాలో కూడా కనిపించింది ..ప్రస్తుతం ఇది ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘ధురంధర్ 2 : ది రివేంజ్’ తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక అందులో భాగంగానే ఈమె గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో ఒకటి ఆమె తండ్రి ఎవరు ? అని..

రాజ్ అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగులో రాజ్ అర్జున్ సినిమాలు

ఆమె తండ్రి ఎవరో కాదు రాజ్ అర్జున్. ఈయన ఎక్కువగా తెలుగుతోపాటు హిందీ, తమిళ్ సినిమాలలో నటించారు . 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం చేసిన రాజ్ అర్జున్, ఇప్పటివరకు సుమారుగా 30కి పైగా చిత్రాలలో నటించారు. అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ అనే చిత్రంతో బాలీవుడ్ లో కూడా మంచి పేరు దక్కించుకున్న రాజ్ అర్జున్.. ముఖ్యంగా పలు తెలుగు సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసి అభిమానులకు దగ్గరయ్యారు. ఈయన నటించిన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం డియర్ కామ్రేడ్ లో క్రికెట్ సెలక్టర్ రమేష్ రావు పాత్రలో నటించారు. అంతేకాదు రజాకార్ మూవీలో నిజాం ప్రభువు ఖాసిం రజ్వీ పాత్ర లో ఒదిగిపోయారు. ఈ చిత్రాలతో పాటు ఝాన్సీ వెబ్ సిరీస్ తో పాటు మరికొన్ని సినిమాలలో నటించారు. ఇక ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా పలు సహాయక పాత్రలు పోషిస్తూ బిజీగా మారారు. ఏది ఏమైనా ఈ విలక్షణ నటుడి కూతురే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..

సారా అర్జున్ బాలీవుడ్ లో దూసుకుపోతుంటే, ఆమె తండ్రి రాజ్ అర్జున్ తెలుగు మరియు ఇతర భాషా చిత్రాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. వారిద్దరూ తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.