
బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలైన సర్దార్జీ మరియు సర్దార్జీ-2 తర్వాత, సర్దార్జీ-3 రిలీజ్ డేట్ ప్రకటించబడింది. దిల్జిత్ దోశాంజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Key Points
సర్దార్జీ-3 సినిమా రిలీజ్ డేట్ ప్రకటన
దిల్జిత్ దోశాంజ్ స్టైలిష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల
త్వరలో టీజర్ విడుదల కానుంది
సర్దార్జీ-3 రిలీజ్ డేట్ ప్రకటన
బాలీవుడ్ హీరో దిల్జిత్ దోశాంజ్(Diljit Dosanjh), రోహిత్ జుగ్రాజ్(Rohit Jugraj) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సర్దార్జీ’.పంజాబీ ఫాంటసీ హారర్ చిత్రం 2015లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా ‘సర్దార్జీ-2’కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే యాక్షన్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించగా.. ఇందులో దిల్జిత్ త్రిపాత్రాభినయం చేశారు. అయితే ఈ మూవీ 2016లో విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా, మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్ ప్రకటించారు. ‘సర్దార్జీ-3’ (Sardarji-3)టైటిల్ రాబోతున్న ఈ సినిమాను ప్రకటిస్తూ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. ఇందులో దిల్జిత్ హీరోగా నటిస్తుండగా.. అమర్ హుండల్(Amar Hundal) దర్శకత్వం వహిస్తున్నారు.
దిల్జిత్ దోశాంజ్ ఫస్ట్ లుక్
అయితే ఈ సినిమాను గన్‌బీర్ సింగ్ సిద్ధు, మన్‌మోర్డ్ సింగ్ సిద్ధు నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ చిత్రబృందం దిల్జిత్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన స్టైలీష్ లుక్‌లో కనిపించగా.. గాగుల్స్ పట్టుకుని ఉండగా.. ఆయన చుట్టూ కొంతమంది అమ్మాయిలు బ్లూ కలర్ ముసుగులు వేసుకుని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక ఈ పోస్ట్‌కు రైడ్‌కి సిద్ధంగా ఉన్నారా.. త్వరలో టీజర్ రాబోతుంది అని రాసుకొచ్చారు.
పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది
A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)
సర్దార్జీ-3 సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలో విడుదలయ్యే టీజర్ మరిన్ని వివరాలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు. దిల్జిత్ దోశాంజ్ అభిమానులకు ఇది పండగే.


