
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సాయంత్రం కొన్ని వస్తువులను దానం చేయడం అశుభ ఫలితాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పెరుగు, ఉప్పు, పాలు ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం.
Key Points
సాయంత్రం పెరుగు, ఉప్పు, పాలు ఇవ్వకండి.
ఇలా చేస్తే గ్రహస్థితి ప్రభావితమవుతుంది.
కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
హిందూ మతం వేద జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. వీటిని అనుసరించడం వలన జీవితంలో శాంతిని పొందవచ్చు. పూర్వకాలం నుంచి పెద్దలు కొన్ని పద్ధతుల్ని పాటిస్తూ వస్తున్నారు. కొన్నిటిని గట్టిగా నమ్ముతారు కూడా. అయితే ఎప్పుడైనా తెలియక పొరపాటు చేస్తే, “ఇలా చేయకూడదు”, “అలా చేయకూడదు” అని చెప్తూ ఉంటారు.
చీకటి పడిన తర్వాత కొన్ని పనులు చేయకూడదని అంటారు. సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత కొన్ని తప్పులు చేయడం వలన అశుభ ఫలితాలను ఎదుర్కొాల్సి ఉంటుందట. సాధారణంగా మనం ఎవరైనా ఏమైనా అడిగితే వారికి ఇస్తూ ఉంటాము. కొన్ని వస్తువులను ఇస్తే అశుభ ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
చీకటి పడిన తర్వాత పెరుగు, ఉప్పు, పాలు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదు. వాటిని కనుక సాయంత్రం వేళ ఎవరికైనా ఇస్తే గ్రహస్థితిలో సమస్యలు రావడమే కాకుండా మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు లాంటివి కూడా కలగవచ్చు.
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు , చంద్రుడు, రాహువు లాంటి గ్రహాలకు సంబంధించినవి ఇవి. సాయంత్రం పూట కొన్ని తప్పులు చేయడం వలన వెంటనే వేగంగా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాయంత్రం పూట నష్టాలు కలగకుండా ఉండడానికి ఎటువంటి వాటిని ఎవరికి ఇవ్వడం మంచిది కాదు? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, ఉప్పు, పాలకు గ్రహాల సంబంధం
ఈ మూడింటిని పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత ఎవరికి ఇవ్వకండి
జ్యోతిష్యం ప్రకారం ప్రతి వస్తువు ఏదో ఒక గ్రహానికి సంబంధించి ఉంటుంది. ఆ వస్తువుని సరైన సమయంలో దానం చేయకపోవడం వలన అసమతుల్యతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా సాయంత్రం పూట రాహువు, కేతువు వంటి నీడ గ్రహాలు చురుకుగా మారుతాయి. ఇలాంటి సమయంలో సానుకూల శక్తి బలహీనంగా మారుతుంది, ప్రతికూల శక్తి బలంగా మారుతుంది. ఈ సమయంలో గ్రహాలకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే ఆ గ్రహం యొక్క ప్రతికూల ప్రభావం పెరుగుతుంది.
పెరుగు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది జీవితంలో ప్రేమ, శ్రేయస్సు, మాధుర్యాన్ని సూచిస్తుంది. చీకటి పడ్డాక లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికైనా పెరుగు ఇస్తే శుక్రుడి శక్తిని బలహీనపరుస్తుంది. దీంతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి, సంపదపై ప్రభావం చూపిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
శుక్రుడు, రాహువుతో ఉప్పుకు సంబంధం కలిగి ఉంటుంది. సాయంత్రం పూట ఎవరికైనా ఉప్పు ఇస్తే ఈ రెండు గ్రహాల సమతుల్యత దెబ్బతింటుంది. మనస్సు, సంపదపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగిపోతాయి.
సాయంత్రం దానం చేయకూడని వస్తువులు
పాలుతో చంద్రుడికి సంబంధం కలిగి ఉంటుంది. సాయంత్రం చీకటి పడ్డాక ఎవరికైనా పాలు ఇస్తే చంద్రుని శక్తిని బలహీనపరుస్తుంది. ఈ కారణంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రాత్రి సమయంలో ఏదైనా తప్పులు చేయడం వలన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని సాయంత్రం సమయంలో ఎవరికైనా అప్పు ఇవ్వడం, లావాదేవీలు జరపడం విషయంలో ఆలోచించాలి. రాహువు, కేతువు వంటి గ్రహాల ప్రభావం సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. నష్టాలు, మానసిక సమస్యలు లాంటివి కలుగవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సాయంత్రం కొన్ని వస్తువులను దానం చేయడం అశుభ ఫలితాలకు దారితీస్తుంది. కాబట్టి, ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి.


