
📌 Key Points
- వేసవి రద్దీని తగ్గించేందుకు SCR ప్రత్యేక రైళ్లను పొడిగించింది.
- తిరుపతి, తిరుచానూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు అదనపు సర్వీసులు.
- నాందేడ్ – తిరుచానూరు మధ్య మే 2, 3 తేదీల్లో ప్రత్యేక రైళ్లు.
- ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచన.
వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు, ప్రజల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ చర్య చేపట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ.
వేసవి రద్దీకి రైల్వే ఊరట
SCR Summer Special Trains : వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుచానూరు, తిరుపతికి వెళ్లే భక్తుల కోసం, అలాగే హైదరాబాద్, బెళగావి, నాందేడ్ వంటి ప్రముఖ నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. మే మొదటి, రెండో వారాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.
తిరుచానూరు – నాందేడ్ రూట్ వివరాలు
తిరుచానూరు – నాందేడ్ – జాల్నా రూట్: మహారాష్ట్ర నుంచి తిరుచానూరు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రైలు సంఖ్య 07015 (హెచ్.ఎస్. నాందేడ్ – తిరుచానూరు) మే 2న (శనివారం) నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 07016 (తిరుచానూరు – హెచ్.ఎస్. నాందేడ్) మే 3న (ఆదివారం) అందుబాటులో ఉంటుంది.
వేసవి రద్దీ కావటంలో రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ విపరీతంగా పెరుగుతోంది. ఈ రద్దీని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సమయాలను ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా సరిచూసుకుని రిజర్వేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
రిజర్వేషన్, ఇతర సూచనలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం వేసవి ప్రయాణికులకు, ముఖ్యంగా భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రయాణ ప్రణాళికలు చేసుకునే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఒక చక్కటి అవకాశంగా నిలుస్తాయి.


