|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! గుత్తి, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు – తేదీలు, సమయాలు ఇప్పుడే తెలుసుకోండి!

Published: 07-03-2026, 10:35 AM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! గుత్తి, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు - తేదీలు, సమయాలు ఇప్పుడే తెలుసుకోండి!
  • దక్షిణ మధ్య రైల్వే యశ్వంత్‌పూర్ – కటిహార్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
  • ఈ రైళ్లు గుత్తి, విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయి.
  • యశ్వంత్‌పూర్ – కటిహార్ రైలు మార్చి 10 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
  • కటిహార్ – యశ్వంత్‌పూర్ రైలు మార్చి 13 నుంచి ఏప్రిల్ 3 వరకు నడుస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. యశ్వంత్‌పూర్ మరియు కటిహార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్దమైంది. ఈ రైళ్లు గుత్తి, విజయవాడ మీదుగా వెళ్లనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యశ్వంత్‌పూర్ – కటిహార్ ప్రత్యేక రైలు వివరాలు

ప్రయాణికుల రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ ఇఛ్చింది. యశ్వంత్‌పూర్ – కటిహార్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్స్ ఏపీలోని గుత్తి, విజయవాడతో పాటు పలు రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం… యశ్వంతపూర్ – కటిహార్ (రైలు నం. 06571) మార్చి 10 నుంచి మార్చి 31వ తేదీ వరకు 4 ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

కటిహార్ – యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు వివరాలు

కటిహార్ – యశ్వంతపూర్ ( రైలు నం. 06572) మధ్య మార్చి 13 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ రూట్ లో 4 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం తేదీల్లో ప్రయాణికులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

రైలు ఆగే స్టేషన్ల వివరాలు

ఈ ప్రత్యేక రైళ్లు యెలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుత్తి, ఢోన్, నంద్యాల, మార్కాపూర్, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపూర్, బలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, అండుల్, డంకుని, భోల్‌పూర్ శాంతినికేతన్, రాంపూర్ హాట్, పాకూర్, కుమేద్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.