|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీక్రెట్స్‌ రివీల్‌ చేయకండి: హృతిక్‌, ఎన్టీఆర్‌ రిక్వెస్ట్‌

Published: 13-08-2025, 8:18 AM

ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా త్వరలోనే విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ముందు స్పాయిలర్స్ నివారించాలని హీరోలు అభ్యర్థించారు. సినిమా అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించమని కోరారు.

Key Points

1

వార్ 2 సినిమా రిలీజ్ అవుతోంది.

2

హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ స్పాయిలర్లను ఆపమని అభ్యర్థించారు.

3

సినిమాను థియేటర్లలో చూడాలని కోరిక.

4

సినిమా అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించాలని విజ్ఞప్తి.

వార్ 2 రిలీజ్‌కు ముందు హీరోల విజ్ఞప్తి

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌లు కలిసి నటించిన వార్‌ 2 చిత్రం మరికొన్ని గంటల్లో(ఆగస్ట్‌ 14) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ  దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్‌ అవుతుండడంతో అభిమానులకు స్పాయిలర్‌ల గురించి హీరోలు రిక్వెస్ట్‌ చేశారు.

స్పాయిలర్లను ఆపాలని హృతిక్, ఎన్టీఆర్ కోరిక

‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి. స్పాయిలర్‌లను ఆపండి. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు.

థియేటర్ అనుభవాన్ని ఆస్వాదించమని సూచన

‘మీరు (అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి’ అని ఎన్టీఆర్ తెలిపారు.

అభిమానులు, మీడియా వార్ 2 సినిమా సీక్రెట్స్ రివీల్ చేయకుండా ఉండాలని హృతిక్ మరియు ఎన్టీఆర్ కోరుతున్నారు. థియేటర్లలో సినిమా చూసి ఆనందించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.