|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీతా నవమి 2025: మే 5 లేదా 6? పూజా విధానం & పూర్తి వివరాలు

Published: 04-05-2025, 9:45 PM
సీతా నవమి 2025: మే 5 లేదా 6? పూజా విధానం & పూర్తి వివరాలు

వైశాఖ శుక్ల పక్ష నవమి నాడు జరుపుకునే సీతా నవమి 2025లో మే 5 లేదా 6 నాడు వస్తుంది. ఈ పండుగ ప్రాముఖ్యత, పూజా విధానం, శుభ సమయాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

2025 సీతా నవమి మే 5 లేదా 6 నాడు జరుగుతుంది.

2

సీతాదేవి జన్మదినోత్సవంగా ఈ పండుగను జరుపుకుంటారు.

4

అభిజిత్ ముహూర్తంలో పూజ చేయడం ఉత్తమం.

సీతా నవమి తేదీ నిర్ధారణ

హిందూమతంలో సీతా నవమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండుగని ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష నవమి నాడు జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచిది. ఈరోజు సీతాదేవిని ప్రత్యేకించి ఆరాధిస్తే సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈసారి సీతా నవమి ఎప్పుడు వచ్చింది? ఈరోజు పూజ చేసే పద్దతి, ప్రాముఖ్యతకి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఈ ఏడాది వైశాఖ మాస శుక్లపక్ష నవమి తేదీ సోమవారం మే 5 ఉదయం 7:36 గంటలకి మొదలవుతుంది. తర్వాత రోజు మే 6 ఉదయం 8:39 వరకు ఉంటుంది. ఈ ప్రకారం సీతానవమి మే 5న జరుపుకోవాలి.

సీతా నవమి పూజా విధానం

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షం మే 5 సోమవారం ఉదయం 7:30 నుంచి మొదలవుతుంది. ఈ సమయం నుంచి సీతాదేవిని ఆరాధించవచ్చు. కానీ సీతాదేవి నవమి తిధి నాడు మధ్యాహ్నం జన్మించింది. కనుక అభిజిత్ సమయంలో పూజించడం శుభప్రదం. ఈ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12 45 వరకు ఉంటుంది. అమృతకాలం 12:20 నుంచి 12:45 వరకు ఉంటుంది. ఈ సమయంలో సీతాదేవిని ఆరాధించడం ఉత్తమమైనది.

సీతా నవమిని ఎందుకు జరుపుకోవాలి?

సీతా నవమి ప్రాముఖ్యత

పౌరాణిక విశ్వసాల ప్రకారం, ఈరోజు జనక మహారాజు సంతానం కోసం యాగ భూమిని సిద్ధం చేయడానికి నాగలితో భూమిని దున్నుతున్నాడు. ఆ సమయంలో సీత భూమి యొక్క గర్భం నుంచి మానవ రూపంలో కనపడింది. అందుకే సీతా నవమి నాడు సీతాదేవి జన్మదిన జరుపుకుంటారు.

సీతా నవమి నాడు సీతాదేవిని భక్తితో ఆరాధించడం ద్వారా ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు. శుభకాలంలో పూజ నిర్వహించి, పుణ్యఫలాలను పొందండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.