
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి సినిమాలకు దోహదపడిన విషయం తెలిసిందే. మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు ఆయన పనిచేయకపోవడంతో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా దీనిపై సెంథిల్ స్పందించారు.
Key Points
రాజమౌళి మరియు సెంథిల్ కుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
మహేష్ బాబు సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయకపోవడానికి ప్రత్యేక కారణం లేదు.
భవిష్యత్తులో ఇద్దరూ కలిసి సినిమాలు చేసే అవకాశం ఉంది.
రాజమౌళి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు, సెంథిల్ కూడా వేరే సినిమాలు చేస్తున్నారు.
రాజమౌళి, సెంథిల్ కుమార్ మధ్య సంబంధం
Senthil Kumar : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలకు చాలా వరకు కెకె సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. సై సినిమా నుంచి మొన్న వచ్చిన RRR వరకు మధ్యలో రెండు సినిమాలు తప్ప అన్ని రాజమౌళి సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. రాజమౌళి విజయంలో సెంథిల్ విజువల్స్ కీలక భాగం. బాహుబలి రెండు పార్టులు, RRR సినిమాలు కూడా అంత విజువల్ గ్రాండియర్ గా కనపడటానికి సెంథిల్ ముఖ్య కారణం.
కానీ ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు సెంథిల్ పనిచేయట్లేదు. ఈ సినిమాకు మరో స్టార్ సినిమాటోగ్రాఫర్ PS వినోద్ వర్క్ చేస్తున్నారు. దీంతో సెంథిల్ – రాజమౌళి మధ్య ఏం జరిగింది? బాహుబలి, RRR లాంటి గ్రాండ్ విజువల్స్ ఇచ్చిన సెంథిల్ ని పక్కన పెట్టారేంటి అని చర్చే జరిగింది. తాజాగా దీనిపై సెంథిల్ స్పందించాడు.
మహేష్ బాబు సినిమాలో సెంథిల్ కుమార్ లేకపోవడానికి కారణం
సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన జూనియర్ సినిమా జులై 18న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెంథిల్ నేడు మీడియాతో మాట్లాడగా రాజమౌళి సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు అనే ప్రశ్న ఎదురైంది.
భవిష్యత్తులో సహకారం?
దీనికి సెంథిల్ సమాధానమిస్తూ.. ప్రత్యేక కారణం ఏమి లేదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. గతంలో కూడా మధ్యలో విక్రమార్కుడు, మర్యాద రామన్న సినిమాలు నేను ఉండగానే రాజమౌళి వేరే సినిమాటోగ్రాఫర్స్ తో పనిచేసాడు. ఇప్పుడు కుదరలేదు. ఇద్దరం అనుకోని మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీదే ఈ సినిమా చెయ్యట్లేదు. తను కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా వేరే సినిమాలు చేస్తున్నాను. కుదిరితే మళ్ళీ భవిష్యత్తులో కలిసి సినిమాలు చేస్తాము అని తెలిపాడు.
రాజమౌళి మరియు సెంథిల్ కుమార్ మధ్య అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకోబడింది. భవిష్యత్తులో వారు మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఉందని సెంథిల్ తెలిపారు.


