|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షారూఖ్ ఖాన్‌కు బిగ్‌ షాక్‌.. రెండు కోట్ల పరువు నష్టం కేసు!

Published: 25-09-2025, 11:34 AM

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నటించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్ పై వివాదం చెలరేగింది. మాజీ నార్కోటిక్స్ అధికారి సమీర్ వాంఖడే రెండు కోట్ల రూపాయల పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

Key Points

1

షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నటించిన 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది.

2

మాజీ నార్కోటిక్స్ అధికారి సమీర్ వాంఖడే రెండు కోట్ల రూపాయల పరువు నష్టం కేసు వేశారు.

4

పరిహారం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ఇవ్వాలని సమీర్ కోరుతున్నారు.

‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వివాదం

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ‌ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు . ఈ నెల 18 న ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్ ‌ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది . ఈ వెబ్ సిరీస్‌లో తనను తప్పుగా చూపించారంటూ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ అధికారి సమీర్‌ వాంఖడే పరువు నష్టం కేసు దాఖలు చేశారు . ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సిరీస్ ‌ లోని ఓ ఎపిసోడ్ ‌ లో ఆర్యన్‌ను డ్రగ్ కేసులో అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖడేతో పోలిక ఉందని నెటిజన్లు కామెంట్స్ ‌ చేయడంతో ఈ వివాదానికి దారితీసింది .

రెండు కోట్ల రూపాయల పరిహారం

దీంతో తనను ఉద్దేశపూర్వకంగానే తప్పుగా చూపించారని మాజీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపిస్తూ .. షారుఖ్ ఖాన్ ,  ఆయన సతీమణి గౌరీ ఖాన్ ‌ కు చెందిన రెడ్ చిల్లీస్ ‌ ఎంటర్ ‌ టైన్‌మెంట్ ‌ తో పాటు నెట్‌ఫ్లిక్స్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రెండు కోట్ల రూపాయల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు . ఇందులో తనపై దురుద్దేశంతోనే తప్పుగా చిత్రీకరించారని సమీర్ వాంఖడే ఆరోపించారు . ఇలాంటి వాటితో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్ ‌ లో ప్రస్తావించారు . ఈ రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని పిటిషన్ ‌ లో ప్రతిపాదించారు.

సమీర్ వాంఖడే ఆరోపణలు

కాగా .. గతంలో సమీర్ వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ను అరెస్టు చేశారు . ఆ సమయంలో సమీర్ వాంఖడే ఈ కేసును డీల్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ ‌ ను దాదాపు నెల రోజులు జైలులో ఉంచారు . ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు . అయితే ఆ తర్వాత 2023లో ఈ కేసులో ఉన్న వారి నుంచి రూ . 25 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే .

ఈ కేసు షారూఖ్ ఖాన్ మరియు ఆయన కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ ఘటన బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.