|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

Published: 25-10-2025, 7:48 PM
షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. ‘షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ పేరుతో ఆయన నటించిన సూపర్‌హిట్ చిత్రాలు అక్టోబరు 31 నుంచి థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇది ఆయన అభిమానులకు పండుగే.

Key Points

1

షారుక్‌ ఖాన్‌ బర్త్‌ డే సందర్భంగా ‘ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ఏర్పాటు.

2

అక్టోబరు 31 నుంచి నవంబరు 14 వరకు షారుక్‌ సూపర్‌హిట్‌ చిత్రాలు ప్రదర్శన.

4

భారతదేశంతో పాటు యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోనూ ప్రదర్శనలు.

కింగ్ ఖాన్ బర్త్‌ డే ట్రీట్

బర్త్‌ డేకి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌  ప్లాన్‌ చేశారు షారుక్‌ ఖాన్‌. నవంబరు 2న షారుక్‌ 60వ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ పేరిట షారుక్‌ నటించిన కొన్ని సూపర్‌హిట్‌ సినిమాలు ఈ నెల 31 నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ‘‘అక్టోబరు 31న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  ప్రారంభం అవుతుంది. ‘దిల్‌ సే, దేవ్‌దాస్, మై హూ నా, ఓం శాంతి ఓం,  చెన్నై ఎక్స్‌ప్రెస్‌’… ఇలా నా కెరీర్‌లోని కొన్ని సూపర్‌హిట్‌ సినిమాలు థియేటర్స్‌లో మళ్లీ ప్రదర్శితం కానున్నాయి. ఈ సినిమాల్లోని మనిషి (తనను తాను ఉద్దేశించి) మారలేదు. జస్ట్‌ హెయిర్‌ మాత్రం మారింది.

ఇంకాస్త అందంగా తయారయ్యాడు. పీవీఆర్‌ ఐనాక్స్‌ అసోసియేషన్‌తో భారతదేశంలోని కొన్ని థియేటర్స్‌లో మాత్రమే ఈ సినిమాలు ప్రదర్శితం అవుతాయి. నార్త్‌ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్‌ దేశాల్లో వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌) సంస్థ ఈ సినిమాలను రిలీజ్‌ చేస్తోంది’’ అని షారుక్‌ పేర్కొన్నారు. అక్టోబరు 31న  ప్రారంభమయ్యే  ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నవంబరు 14 వరకు కొనసాగుతుందట. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ‘కింగ్‌’ సినిమాతో షారుక్‌ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతో ద్వారా కుమార్తె సుహానా నటిగా పరిచయం కానున్నారు.

ప్రదర్శితమయ్యే సూపర్‌హిట్‌ చిత్రాలు

ఫెస్టివల్‌ జరిగే దేశాలు, తేదీలు

షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆయన కెరీర్‌లోని మైలురాళ్లను గుర్తుచేస్తుంది. అభిమానులు ఆయన సూపర్‌హిట్‌ చిత్రాలను మళ్లీ వెండితెరపై చూసే అద్భుత అవకాశం ఇది. కింగ్ ఖాన్ బర్త్‌ డే వేడుకలు ఇలా మరింత ప్రత్యేకంగా మారనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.