|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Shahrukh-Sukumar: సుకుమార్ తో షారుఖ్ ఖాన్ మూవీ.. ‘1 నేనొక్కడినే’ సినిమాకు లింక్ ఉంటుందట

Published: 19-04-2026, 7:05 AM
Shahrukh-Sukumar: సుకుమార్ తో షారుఖ్ ఖాన్ మూవీ.. ‘1 నేనొక్కడినే’ సినిమాకు లింక్ ఉంటుందట

Shahrukh-Sukumar: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెక్కల మాస్టారుగా పేరు తెచ్చుకున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. తన వైవిధ్యమైన మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయన టాప్. ఆర్య నుంచి మొన్నొచ్చిన పుష్ప వరకు ఆయన ఎదిగిన తీరు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ‘పుష్ప’ చిత్రంతో సుకుమార్ పేరు పాన్-ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. గ్రామీణ నేపథ్యం, రా ఆండ్ రస్టిక్ యాక్షన్, బలమైన క్యారెక్టరైజేషన్లను రూపొందించడంలో సుకుమార్ స్టయిలే వేరు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.

అయితే, రామ్ చరణ్ సినిమా తరువాత సుకుమార్ బాలీవుడ్ లో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shahrukh-Sukumar)తో సుకుమార్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సుకుమార్ మార్క్ ఇంటెన్స్ స్టోరీటెల్లింగ్, షారుఖ్ ఖాన్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, ఈ కాంబోలో రావోతున్న మూవీ సుకుమార్ మహేష్ బాబుతో చేసిన ‘1 నేనొక్కడినే’ అనే సినిమాకు లింక్ ఉంటుందని తెలుస్తోంది. ‘జవాన్’ సినిమాతో సౌత్ స్టైల్ మాస్ సినిమా ట్రీట్మెంట్‌ను ఆస్వాదించిన షారుఖ్ అభిమానులు, ఇప్పుడు సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌తో ఆయన జతకట్టడం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక షారుఖ్ ఖాన్ కూడా ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులను ఒకే చేసే పనిలో ఉన్నాడు. ఆగస్టు, అక్టోబర్ మధ్య ఆయన నెక్స్ట్ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి వంటి స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినబడుతున్నప్పటికీ, సుకుమార్‌తో సినిమా పట్టాలెక్కితే అది ఇండియన్ సినిమాలో ఒక భారీ కమర్షియల్ విందు కానుంది. సుకుమార్ కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా, తన మేకింగ్ స్టైల్‌తో బాలీవుడ్ మార్కెట్‌లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి లెక్కల మాస్టర్ బాలీవుడ్ లెక్కలు సెట్ చేస్తాడా అనేది చూడాలి మరి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.